Ramcharan: మళ్ళీ మొదలవనున్న గేమ్ చేంజర్ షూట్..ఇప్పుడైనా ముగిస్తారా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటుంది. టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ కేజ్రీయెస్ట్ పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. దీనికంటే తర్వాత మొదలైన పలు పాన్ ఇండియన్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.

అటు చరణ్ అభిమానులు కూడా శంకర్ గేమ్ చేంజర్ ని పక్కన పెట్టి ఇండియన్2 సినిమా చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక దిల్ రాజు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు ఏ సినిమా అప్డేట్ చెప్పినా, ఈ సినిమా ప్రస్తావన మాత్రం తేకపోవడంతో సోషల్ మీడియా లో చరణ్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్ల్స్ చేసారు. అయితే ఎట్టకేలకు గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది.

గేమ్ చేంజర్ యొక్క షూటింగ్ మళ్ళీ మొదలుకానుందని జులై 10నుండే ఆ సినిమా యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం వచ్చింది. ఇక ఈ షూటింగ్ లో పలు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నారని రామ్ చరణ్ సన్నిహిత వర్గాల నుండి సమాచారం వచ్చింది. ఇదే నిజమైతే గేమ్ ఛేంజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చినట్టే. అయితే మొదలు పెట్టిన తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ఈ సంవత్సరమే షూటింగ్ మొత్తం పూర్తి చేయాల్సిందిగా ఫ్యాన్స్ శంకర్ ని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మొదలవనున్న షూటింగ్ ఎన్ని రోజులు జరుపుకుంటుందో ఇంకా క్లారిటీ రాలేదు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు