The GOAT OTT : విజయ్ డ్యూయల్ యాక్షన్ మూవీ.. ఓటీటీలోకి వచ్చే డేట్ ఇదే..!

The GOAT OTT : ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay dalapati)ద్విపాత్రాభినయం చేస్తూ తెరకెక్కిన తాజా చిత్రం ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రీమియర్ షో వేయగా, ఇది చూసిన నెటిజన్స్ ట్విట్టర్ ద్వారా సినిమాకు పాజిటివ్ కామెంట్లు ఇస్తుంటే, మరికొంతమంది ఇందులో విజయ్ డి ఏజింగ్ లుక్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అవ్వగా, యాక్షన్స్ సన్నివేశాల లో విజయ్ ని చాలా అద్భుతంగా చూపించారు. కానీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పుడు, పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది ఈ చిత్రం . అయితే తప్పొప్పులను సరి చేస్తామని సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వెంకట్ ప్రభు కామెంట్లు చేశారు. అయితే అందుకు తగ్గట్టుగా ఇందులో విజయ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అనుకున్నారు. కానీ విజయ్ లుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

The GOAT OTT : Vijay's dual action movie.. this is the date that will come to OTT..!
The GOAT OTT : Vijay’s dual action movie.. this is the date that will come to OTT..!

ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఫిక్స్..

ఇకపోతే సెప్టెంబర్ 5వ తేదీన సోలో మూవీగా విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్ డేట్ కూడా అప్పుడే వైరల్ గా మారింది. గోట్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత ఓటిటి ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారం చేయబడుతుందని సమాచారం. ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీ లోకి వస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో రెండు నెలల తర్వాత అంటే నవంబర్ నెలలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ది గోట్ లో భారీ తారాగణం..

ఇకపోతే వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రశాంత్, మోహన్, అజ్మల్ అమీర్, ప్రభుదేవా, లైలా, స్నేహ, జయరాం, మీనాక్షి చౌదరి, యోగిబాబు, వైభవ్, ప్రేమీ అమరేన్, యుగేంద్రన్ ఇలా తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తీసుకురావడంతో మొదటి రోజే రూ .100 కోట్లు రాబడుతుందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు తమిళ్ తంబీలు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే కలెక్షన్లు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

బెడిసి కొడుతున్న విజయ్ లుక్స్..

ఇకపోతే డైరెక్టర్ వెంకట్ ప్రభు విషయానికి వస్తే.. ఇందులో మొదటగా తండ్రిగా సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన కొడుకుగా హీరో ధనుష్ ను తీసుకోవాలని అనుకున్నారట వెంకట్ ప్రభు. అయితే డీ ఏజింగ్ యాప్ ఉపయోగించి ఒకే పర్సన్ ను ఇద్దరు వ్యక్తులుగా చూపించవచ్చని ఆలోచించిన వెంకట్, వారిద్దరిని కాదని విజయ్ ను రంగంలోకి దింపారు. డి ఏజింగ్ ఆప్ వల్ల సినిమాలో నటుల సంఖ్య తగ్గుతుంది. కానీ లుక్స్ మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఏది ఏమైనా సినిమా కథపరంగా పాజిటివ్ రివ్యూ అందుకుంటున్నప్పటికీ విజయ్ లుక్స్ కారణంగా బెడిసి కొడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరొకవైపు నెట్ఫ్లిక్స్ వేదికగా మరో ఎనిమిది వారాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అటు ఓటీటీ లో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు