Animal: సినిమాకి హైలెట్ అవనున్న ఇంటర్వెల్?

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబో లో వస్తున్న పాన్ ఇండియా మూవీ “అనిమల్”. ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గరి నుండి సినిమా టీజర్, ట్రైలర్ కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుని అనిమల్ పై ఉన్న అంచనాల్ని భీభత్సంగా పెంచేసాయి.

ఇక ఆనిమల్ పై ఇన్ని అంచనాలు పెరగడానికి కారణం సందీప్ రెడ్డి వంగయే అని తెలిసిందే. డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అనిమల్ మేకర్స్ అటు హిందీ, ఇటు తెలుగులో కూడా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అనిమల్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

యానిమల్‌ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ దాదాపు 18 నిమిషాల పాటు ఉంటుంది. ఈ ఇంటర్వెల్ బ్లాక్ కి సంబందించిన సీక్వెన్స్ ను ఆల్రెడీ ప్రీ టీజర్, టీజర్ మరియు ట్రైలర్‌లో కూడా చూపించారు. ఇక ఈ మొత్తం ఆక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ మాస్టర్ రూపొందించారు. సినిమా మొత్తంలో గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఇంటర్వెల్ నుండే స్టార్ట్ అవుతాయట. ఇక్కడి నుండే రణబీర్ లోని మరో యాంగిల్ బయటపడుతుందట.

- Advertisement -

ఇక ట్రైలర్‌లో చూపిన ప్రత్యేకమైన వార్ మెషీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ రూపొందించారు. అనిమల్ సినిమా దాదాపు 203 నిమిషాల నిడివితో ఉండడం విశేషం.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు