Naresh – Pavitra : నాలుగోది కూడా నిలవడంలే… నరేష్ – పవిత్ర కాపురంలో చిచ్చు… ఇక విడాకులేనా…?

Naresh – Pavitra : ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు, రెండో పెళ్లి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అందుకు కారణాలు కూడా అనేక ఉన్నాయి.. గత ఏడాది నుంచి హాట్ టాపిక్ గా మారిన ముదురు జంట నరేష్ – పవిత్రలు.. మళ్లీ పెళ్లి అనే సినిమాకోసం భారీగా ప్రమోషన్స్ చెయ్యడమే కాదు.. రియల్ గా ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో మునిగారు.. అప్పట్లో ఎక్కడ చూసినా వీరిద్దరి టాపికే.. నరేష్ మూడో భార్యతో గొడవపడి మరి పవిత్రను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ కాపురం కూడా కూలిపోయేలా ఉందని సోషల్ మీడియాలో ఓ రేంజులో వార్తలు వినిపిస్తున్నాయి..

అసలు మ్యాటరేంటంటే.. లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు.. అంతేకాదు సినిమా పేరు చెప్పి మరింత దగ్గరయ్యారు.. ఆ సినిమా అనుకున్న హిట్ అవ్వలేదు కానీ వీరిద్దరి మాత్రం సోషల్ మీడియా లవ్ బర్డ్స్ అయ్యారు.. అయితే ఈ మధ్య వీరిద్దరి పేర్లు ఎక్కడా వినిపించలేదు..

The news of Naresh Pavitri's separation is going viral on social media
The news of Naresh Pavitri’s separation is going viral on social media

తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త నెట్టింట దుమారం రేపుతుంది.. పవిత్ర నరేష్ కు విడాకులు ఇవ్వబోతుందని టాక్.. అదేంటి ఇద్దరు అంత రచ్చ చేసి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో తెగతెంపులు చేసుకొని కలిశారు.. ఇప్పుడు విడిపోవడం ఏంటో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. అందుకు కారణం రమ్య రఘుపతినే అని తెలుస్తుంది.. పవిత్రను మానసికంగా టార్చర్ చేస్తుందని, వేరే మగవాళ్ళతో ఫోన్లు చేయించి అసభ్యంగా మాట్లాడిస్తుందని సమాచారం.. అది తట్టుకోలేక పవిత్ర ప్రస్తుతం నరేష్ కు దూరంగా ఉందని టాక్.. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇది విన్న నెటిజన్లు ఏంటి నరేషా నాలుగోది కూడా నిలవడంలేదా.. పవిత్ర పోతే ఇంకెవరు నీకు తోడు.. పగోడికి కూడా నీ కష్టం రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వార్తలతో నరేష్ – పవిత్రలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు