Jagathi Photos : లోదుస్తుల్లో ‘గుప్పెడంత మనసు’ జగతి రచ్చ

“గుప్పెడంత మనసు” సీరియల్ కు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందులో పాత్రధారులైన రిషి, జగతి, మహేంద్ర, వసులకు వెండితెరపై స్టార్స్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే దాదాపుగా సీరియల్స్ లో నటించే అమ్మాయిలంతా శాండిల్ వుడ్ నుంచే వస్తూ ఉంటారు.

అలా వచ్చిన ఈ కన్నడ భామలే తెలుగు బుల్లితెరపై మనోళ్ళను డామినేట్ చేస్తూ, స్టార్ స్టేటస్ అందుకుంటూ ఉంటారు. ఇదే రీతిలో ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన జ్యోతి రాయ్.. అదే ‘గుప్పెడంతో మనసు’ సీరియల్లో జగతి మేడం పాత్రతో అందరిని కట్టిపడేసిన అమ్మాయి… తను కూడా సోషల్ మీడియా టాప్ లేపేస్తోంది. సీరియల్లో ఆమె లుక్ చూసి ఏదో పాత చింతకాయ పచ్చడి అనుకునేరు. సోషల్ మీడియాలో మోడ్రన్ లుక్ లో ఆమె కనిపించే తీరుకు నెటిజెన్లు నోరు వెళ్ళబెడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జ్యోతికి సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది. జ్యోతి లవ్, పర్సనల్ లైఫ్, ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో సంచలనం రేపుతున్నాయి. ఈ బ్యూటీ ఓ యంగ్ డైరెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా ఓ ఉంగరం ఫోటోను కూడా షేర్ చేసింది. కానీ పెళ్లి మీద మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్న జ్యోతి సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. తాజాగా ఆమె లోదుస్తుల్లో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

- Advertisement -

అందాలను ఆరబోస్తూ ఆమె ధరించిన పల్చటి దుస్తులు చూసి నెటిజన్లు చొంగ కార్చుకుంటున్నారు. ఆమె పెంచేస్తున్న హీట్ కి ఇంటర్నెట్ తగలబడిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? అంటూ ఆమెపై క్యూట్ గా కోప్పడుతున్నారు. నిజానికి ఆ ఫోటోలు జ్యోతి నటిస్తున్న ‘ప్రెట్టి గర్ల్’ అనే వెబ్ సిరీస్ కు సంబంధించినవట.

ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ‘ఎ మాస్టర్ పీస్’ అనే మూవీలో కూడా నటిస్తోంది జ్యోతి. ఏదేమైనా ఈ బ్యూటీకి రోజురోజుకూ మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. వెబ్ సిరీస్ కే ఇలా అందాలను వడ్డించేస్తే, సినిమాల్లో ఏ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుందో ఈ అమ్మడు!

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు