Shaakuntalam: సమంత కు వార్నింగ్ ఇచ్చిన నిర్మాత..!

సీనియర్ నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు, సమంత మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమా రిలీజ్ అయిన సమయంలో సమంతకి వయసు అయిపోయిందని, శకుంతల పాత్రకి సమంత సెట్ అవదని, సినిమా ప్రమోషన్ కోసం సమంత సెంటిమెంట్ డ్రామా ఆడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేసాడు చిట్టి బాబు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన సమంత పరోక్షంగా చిట్టి బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చింది. చెవుల్లో వెంట్రుకలు ఎందుకు మొలుస్తాయి అంటూ గూగుల్ సెర్చ్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని తన స్టేటస్ లో పెట్టిన సమంత కాసేపటికి డిలీట్ చేసినా కూడా ఆ పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.

తాజాగా సమంత కౌంటర్ గురించి మీడియా ప్రశ్నించగా ఘాటుగా స్పందించాడు చిట్టిబాబు. తన పేరు వాడకుండా తనని విమర్శిస్తున్నారని, తాను మాత్రం డైరెక్ట్ గా సమంత కె సమాధానం చెపుతున్నా అని అన్నారు. తన పేరు గనక వాడి ఉంటే సమంతపై లీగల్ యాక్షన్ తీసుకొని ఉండే వాడిని అని అన్నారు. శాకుంతలం సినిమాపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఇప్పటికి ఆ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానని అన్నారు. తాను ఓపెన్ అయితే సమంత తట్టుకోలేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

నాగచైతన్యతో విడాకుల తర్వాత నుండి ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్న సమంత ఎప్పటికప్పుడు గట్టి సమాదానాలు ఇస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్స్ ని సైతం ఎదుర్కొంది సమంత. ఈ నేపథ్యంలో చిట్టిబాబు ఇచ్చిన వార్నింగ్ కి సమంత ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అని నెటిజన్లు ఆసక్తిగా ఉన్నారు. చిలికి చిలికి గాలివానగా మారుతున్న ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు