Balagam: దిల్ రాజు చేశాడు కాబట్టే హిట్… ఆ నిర్మాత చేసి ఉంటే ఫట్టే!

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో చిన్న సినిమాగా విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ “బలగం”. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్సిత నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

తెలంగాణలోని సిరిసిల్ల అనే ప్రాంతంలో తెరకెక్కింది ఈ మూవీ. ఓ కుటుంబంలోని పెద్దమనిషి చనిపోతే ఆ కుటుంబీకుల మధ్య ఉండే బంధాలు, భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న కథాంశమే “బలగం”. అయితే ఈ మూవీ దిల్ రాజు చేతిలో పడింది కాబట్టే హిట్ అయింది. లేదంటే “బలగం” మూవీ పత్తా లేకుండా పోయేది. నిజానికి “బలగం” మూవీనీ ముందుగా వేరొక నిర్మాత చేయాలని అనుకున్నారట. డిస్ట్రిబ్యూటర్ శివరాం ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించాల్సి ఉందట.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ దిల్ రాజు చేతిలో వచ్చి పడింది. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ తోనే హిట్ అయ్యింది. మార్చ్ 3న “బలగం” మూవీ థియేటర్లలోకి వచ్చింది. ముందుగా ఈ సినిమాకు రెండు వారాలపాటు పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. కానీ తర్వాత పాజిటివ్ టాక్ పెరగడం, దిల్ రాజు ప్రమోషన్స్ విషయంలో చాకచక్యంగా వ్యవహరించడంతో రెండు వారాల తర్వాత కూడా “బలగం” మూవీ థియేటర్లలో నడిచింది.

- Advertisement -

దిల్ రాజు నిర్మాత కావడంతో “బలగం” మూవీ థియేటర్లలో ఆ మాత్రం నడిచి, హిట్ మూవీగా నిలిచింది. అదే వేరే నిర్మాత అయ్యి ఉంటే గనక రెండు వారాల లోపే “బలగం” మూవీని థియేటర్లలో నుంచి లేపేసేవారు. కాబట్టి ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్స్ ఉండేదే కాదు. అలాగే నిర్మాతలకు నష్టాలు కూడా తప్పేవి కాదు.

ఇక అతి తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వివాదంలో చిక్కుకున్న విషయం కూడా తెలిసిందే. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ కొంతమంది వివాదానికి తెర తీశారు. ఏదైతేనేం డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వేణుకు ఈ మూవీ మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇక “బలగం” మూవీ థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీ లో కూడా రిలీజ్ అయి అందరికీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన తర్వాత థియేటర్లలో కంటే ఓటీటీ లోనే “బలగం” మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు