Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ నుంచి రామ్ చరణ్ ఔట్.. అక్కడికి అందుకే వెళ్లాడా?

Ram Charan : టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు… శంకర్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమాలో చరణ్ సరికొత్తగా కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాను స్క్రీన్ పై ఎప్పుడూ చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.. అయితే మేకర్స్ గతంలో ఒక డేట్ ను అనుకున్న మేకర్స్ ఇప్పుడు సెప్టెంబర్ లో రాబోతుందని హింట్ ఇచ్చేశారు.. విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో షూటింగ్ పూర్తి చేసేపనిలో శంకర్ టీమ్ ఉన్నారు.. ఇలాంటి టైం లో రామ్ చరణ్ షూటింగ్ నుంచి ఔట్ అయ్యారు..

అదేంటి ఇండియన్ 2 దెబ్బేయ్యడం వల్ల రామ్ చరణ్ కు భయం పట్టుకుందా? అందుకే గ్యాప్ తీసుకుంటున్నాడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇలా చెర్రీ వరుసగా గ్యాప్ తీసుకుంటే సినిమా మళ్లీ వాయిదా తప్పదు అనే టాక్ వినిపిస్తుంది.. మరి దీనిపై రామ్ చరణ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇక రామ్ షూటింగ్ కు గ్యాప్ తీసుకొని లండన్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.. అయితే చెర్రీ ఒంటరిగా అక్కడకు వెళ్ళడానికి కారణం కూడా లేకపోలేదు.. మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాట్ల కోసమే చెర్రీ లండన్ వెళ్లాడని టాక్ నడిచింది. కానీ తాజాగా ఆయన లండన్ ట్రిప్ వెనుక మరో కారణం ఉందంటూ కొత్త వార్త వినిపిస్తుంది..

The reason behind Ram Charan's London trip
The reason behind Ram Charan’s London trip

కాగా.. మేడమ్ టుస్సాడ్స్‌లోని తన మైనపు విగ్రహానికి సంబంధించిన వివరాలను తెలుసుకొనేందుకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు అతను మూవీకి సంబందించిన దానికోసం అక్కడకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవడానికే లండన్ వెళ్లాడని అంటున్నారు. ఈ కొత్త వాదనలతో రామ్ చరణ్ ట్రిప్ చుట్టూ ఉన్న సందడి ఒక్కసారిగా పెరిగియింది.. అసలు మూవీ కోసం వెళ్లిడా? లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైన ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మరి దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు