Allu Arjun: పుష్ప2 కి రిలీజ్ డేట్ కష్టాలు తప్పేలా లేవు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. పుష్ప2 విషయంలో తరచూ ఎదో ఒక అప్డేట్ వినిపిస్తూ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం సుకుమార్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలొస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు, డైరెక్టర్ డైలమాలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.పుష్ప పార్ట్ 1 2021 డిసెంబర్లో విడుదల కాగా తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు, అయితే నార్త్ లో క్లిక్ అవ్వటం వల్ల బ్లాక్ బస్టర్ అయ్యింది.

పుష్ప2 ని కూడా డిసెంబర్లో 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్, ఇదే ఇప్పుడు యూనిట్ ని డైలమాలో పడేసింది. పార్ట్ 1 డిసెంబర్లో రిలీజ్ అయ్యి నెల తిరగక ముందే ఓటీటీలో స్ట్రీమ్ అవ్వటం వల్ల సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయలేకపోయింది. ప్రస్తుతం పుష్ప2 మీద భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో డిసెంబర్ రిలీజ్ కలిసొస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పెద్ద సినిమా రిలీజ్ కి సరైన సమయంగా భావించే సంక్రాంతి సీజన్ ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి కాబట్టి పుష్పరాజ్ కి సంక్రాంతిని క్యాష్ చేసుకునే అవకాశం లేదు.

వేసవికి కూడా కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర సినిమా, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా సమ్మర్ కే రిలీజ్ అవనుంది కాబట్టి పుష్ప కి డిసెంబర్ మినహా వేరే ఆప్షన్ కనపడట్లేదు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవనున్న ఈ సినిమాకి బాలీవుడ్లో కూడా సరైన స్లాట్ దొరకటం అవసరం. బాలీవుడ్లో కూడా షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. వీటి రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో పుష్ప2 కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవటం పెద్ద సమస్యగా మారింది. పుష్పతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2తో ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు