Nani – Samantha : నాని, సమంత కొత్త సినిమా? ఇద్దరు కలిసే అక్కడికే ట్రిప్?

Nani – samantha : టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా సమంతతో కలిసి ఎక్కడికో వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇద్దరు కలిసే వెళ్తున్నారా? అనుకోకుండా కలిసారా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని ముంబైకి వెళ్తూ హీరోయిన్ సమంత ని కలిసాడు. నాని ముంబై వెళ్తూ సమంతని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసాడు. సమంత కూడా నాని వెళ్తున్న ఫ్లైట్ కే ముంబైకి వెళ్తుండటంతో ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్లారు. నాని, సమంత కలిసి నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

The video of Nani and Samantha meeting at the airport is viral
The video of Nani and Samantha meeting at the airport is viral

ఆ వీడియోలో నాని, సమంత ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఫ్లైట్ దగ్గరకు వెళ్లడం కోసం బస్ ఎక్కినప్పుడు వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వీరిద్దరినీ స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయ్యింది. మళ్లీ ఒక్క సినిమా చేస్తే బాగుండునని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.. ఇక సమంత కూడా ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ముంబైకి, ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. నాని, సమంత కలిసి గతంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ ఇలా కలిసి సరదాగా మాట్లాడుకోవడం, ఆ వీడియోలు వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.. ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు