Naagarjuna – Balakrishna : తెలుగు ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్త అక్కినేని నాగార్జున, బాలయ్య మధ్య గొడవలకు ఎందుకు వచ్చాయనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కరు దీనిపై సరైన సమాధానం ఇవ్వలేదు.. కానీ వీరిద్దరి పై అనేక రకాల వార్తలు అయితే వచ్చాయి.. అసలు వీరి గొడవలకు కారణం ఇదే అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఎందుకు గొడవలు అయ్యాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
నందమూరి, అక్కినేని ఫ్యామిలీలు తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఫ్యామిలీలు.. ఇండస్ట్రీని శాసిస్తున్న కుటుంబాల్లో ఈ రెండు కుటుంబాలు కూడా ఉన్నాయి.. అయితే స్టార్ హీరోల మధ్య పెద్దగా మాటలు ఉండవు.. సినిమాల కోసం ఏదో మాట్లాడుతారు.. బాలయ్య, నాగార్జునలు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక వార్త బయట వినిపిస్తోంది. గత కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని అభిమానులు బాలయ్య పైన ఫైర్ అయ్యారు..
గతంలో ఓ ఈవెంట్ కు వెళ్లిన బాలయ్య నాగేశ్వరావు నాకు బాబాయ్ లాంటి వాడు అని పొగుడుతూనే సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ వ్యాఖ్యలు నాగార్జున అభిమానులను బాగా బాధ పెట్టాయి.. జోస్ ఆడియో ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడుతూ. నాగార్జునకి అచ్చం నాగేశ్వరరావు పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కూడా పక్కా కమర్షియల్ బిజినెస్ మాన్ గా కనిపిస్తూ ఉంటారని ఆయన అన్నాడు. అప్పుడు నాగ్ పరిస్థితి దారుణంగా మారింది.. ఆ విషయానికి నాగార్జున ఫీల్ అయ్యాడట.. అందుకే ఇద్దరి మధ్య స్నేహం చెడిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇవి కూడా ఊహగానాలే నిజాలు అయితే ఎందనేది ఎవరికీ తెలియదు..