Bharateeyudu 2 : శంకర్ కథే భారతీయుడు… ఈ మూవీ తీయడం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది

Bharateeyudu 2 : నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసిన సినిమా భారతీయుడు 2.. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. కానీ ప్రస్తుతం మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది.. అయితే ఈ సినిమాలో లంచం అనే కాన్సెఫ్ట్ తీసుకోవడానికి కారణం ఉందట.. ఆ కారణంతోనే భారతీయుడు సినిమా తీసినట్లు తెలుస్తుంది.. అసలు శంకర్ ఈ సినిమా తియ్యడానికి అసలు కారణం ఏంటో ఒకసారి చూసేద్దాం..

అర్జున్ తో జెంటిల్మెన్ మూవీ తో దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చిన శంకర్ మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో ఇండస్ట్రీకి చాటి చెప్పారు. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. నెక్స్ట్ వచ్చిన ప్రేమికుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.ఇలా భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, స్నేహితుడు, శివాజీ, అపరిచితుడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు.. అలా ఏ సినిమా చేసినా కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే భారతీయుడు సినిమా తియ్యడానికి మాత్రం తన జీవితంలో జరిగిన పెద్ద తప్పే కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి..

అసలు మ్యాటరేంటంటే.. డైరెక్టర్ శంకర్ చదువుకొనే రోజుల్లో సర్టిఫికెట్ కావాలని వెళితే రూ. 100, 50 లంచం అడగడంతో అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడట.. ఆ తర్వాత చాలా రోజులు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టు తిరిగాడట.. ఆ అంశాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని సినిమా చేశాడు.. అప్పుడు భారీ విజయాన్ని అందుకుంది.

- Advertisement -

లంచం, అవినీతి, అక్రమాలకు సంబంధించిన స్టోరీనే ఉంటుంది. ఈ సినిమాని ముందుగా రజినీకాంత్ తో అనుకున్నప్పటికీ, ఆ తర్వాత తండ్రి పాత్రలో రాజశేఖర్ కొడుకు పాత్రలో వెంకటేష్ ని తీసుకుందామని అనుకున్నారు.. కానీ డేట్స్ కుదరకపోవడంతో మళ్లీ కమల్ తోనే సినిమా చేసినట్లు తెలుస్తుంది… అదన్నమాట భారతీయుడు సినిమా చెయ్యడానికి అసలు కారణం.

కాగా, ఆ సినిమాకు సీక్వెల్ గా తాజాగా భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం ఆడియన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

భారతీయుడు 2 Filmify Review కోసం ఇక్కడ క్లీక్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు