Tillu square: సిద్దు జొన్నలగడ్డకు ప్రభాస్ వార్నింగ్..?

డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ సినిమాతో పాటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయిపోయాడు.

టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశి నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదలవ్వాల్సి ఉండగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ పోన్ అయినట్టు టాక్ నడుస్తుంది. ముందు నుంచి పలు కారణాలు మరియు వివాదాల మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడటంతో వార్తల్లోకెక్కింది.

అయితే టిల్లు స్క్వేర్ సినిమా వాయిదా పాడటానికి కారణం సలార్ సినిమానే అని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో టిల్లు స్క్వేర్ సినిమాకు థియేటర్స్ ఎక్కువగా ఇవ్వడానికి లేకపోవడంతో సలార్ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తరువాత ఈ సినిమా రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తుంది.

- Advertisement -

ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 6న రిలీజ్ చేయనున్నరట. త్వరలోనే ఈ కొత్త రిలీజ్ డేట్ ను మూవీ టీం ప్రకటించనున్నట్టు టాక్. దీన్ని బట్టి చూస్తే సలార్ సినిమా దాటికి సెప్టెంబర్ లో వచ్చే సినిమాలు దాదాపు పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు