Tollywood Heroine: 4వ పెళ్లికి సిద్ధమైన బ్యూటీ.. ఈసారైనా సం*సా*రం చేస్తుందా..?

Tollywood Heroine.. ఇటీవల కాలంలో ఫిలిం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత కొద్ది రోజులుగా ఈ వార్తలు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా కాస్త లైట్ తీసుకుంటున్నారని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుత కాలంలో ఎక్కువగా సినీ సెలబ్రిటీలు విడిపోతూ ప్రస్తుత సమయాన్ని విడాకులు ట్రెండ్ గా మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటికి నిన్న ప్రముఖ నటుడు జిషు సేన్ తన భార్యతో 20 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత విడిపోతున్నట్లు వార్తలు వినిపించగా ..ఇప్పుడు మరొక బ్యూటీ వనిత విజయ్ కుమార్ నాలుగవసారి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tollywood Heroine: The beauty who is ready for her 4th marriage.. will she marry this time too..?
Tollywood Heroine: The beauty who is ready for her 4th marriage.. will she marry this time too..?

మళ్లీ పెళ్లికి సిద్ధమైన వనిత విజయ్ కుమార్..

కోలీవుడ్ హీరోయిన్ వనిత విజయ్ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాస్పద నటిగా పేరుపొందిన వనిత విజయ్ కుమార్ ఇప్పుడు నాల్గవ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2000 వ సంవత్సరంలో నటుడు ఆకాష్ ను మొదటిసారి వివాహం చేసుకుంది. వీరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆ తర్వాత నటుడు ఆకాష్ నుంచి విడిపోయిన ఈమె, ఆనంద్ అనే వ్యాపారవేత్తను మళ్ళీ వివాహం చేసుకుంది. వీరికి జయనిత అనే కుమారుడు కూడా జన్మించారు.

ఒంటరిగా.. సినిమాలపై దృష్టి..

ఇకపోతే మొదటి భర్తతో పుట్టిన కుమారుడు విజయ్ హరి తండ్రితో ఉండేలా కోర్టు ఆదేశించడంతో విజయ హరి తండ్రి తోనే కలిసి ఉంటున్నాడు. రెండో భర్తకు జన్మించిన జయనీతా కూడా తన తండ్రి వద్దే ఉండగా వనిత దగ్గర మొదటి భర్త కుమార్తె జోవికా మాత్రమే ఉంది.. ఈ నేపథ్యంలోనే ఈమె 2020లో పీటల్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి . కానీ ఈమె మాత్రం అతడితో పెళ్లి జరగలేదు అంటూ చెప్పింది. కానీ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు కొంతకాలానికే మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక అప్పటినుంచి ఒంటరిగా ఉన్న వనిత విజయ్ కుమార్ సినిమాలపై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది.

- Advertisement -

ఊహించని దానికోసం ఎదురుచూడండి..

అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ నాలుగో సారి పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే.. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈమె, ఒక అభిమాని ప్రశ్నకు సమాధానం ఇస్తూ..” ఊహించని దానికోసం మీరు ఎదురు చూడండి” అంటూ తెలిపింది. దీంతో ఈమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రేక్షకులు.. మొత్తానికైతే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురితో కూడా విడిపోయిన ఈమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా? లేక కొత్తవారిని వివాహం చేసుకోబోతుందో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మళ్లీ పెళ్లి పేరుతో నరేష్ లాగే ఇప్పుడు వనిత విజయ్ కుమార్ కూడా వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు