Tollywood: సౌందర్య మరణాన్ని ఆమె తండ్రి ముందే ఊహించాడా? జాతకంలో ఏముంది !

అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగింటి ఆడపడుచులా ఎంతోమంది ప్రేక్షకులను తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. గ్లామర్ ఒలకబోస్తేనే అవకాశాలు వస్తాయన్న సమయంలో కూడా నిండుదనంతో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, అన్ని వర్గాల వారిని కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది.

గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్ర కథనాయికగా చక్రం తిప్పిన సౌందర్య అనుకోని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నిజానికి సౌందర్యను డాక్టర్ ను చేయాలని ఆమె తండ్రి కలలు కన్నాడట. కానీ కూతురు జాతకంలో సినీ నటి అవుతుందని ఉందట. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో డాక్టర్ కావాల్సిన సౌందర్య నటిగా అరంగేట్రం చేసింది.

ఇక సౌందర్య తండ్రి సత్యనారాయణకు జాతకాలపై మంచిపట్టు ఉండేదట. ఓ సందర్భంలో డైరెక్టర్ చిట్టిబాబుతో మాట్లాడుతున్న ఆయన… సౌందర్య గురించి మాట్లాడుతూ, తన కూతురి జాతకం ప్రకారం ఆమె దక్షిణాదిలో టాప్ హీరోలందరితో పనిచేసిన అగ్రనటిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటుందని చెప్పారట. కానీ 2004లో ఆమె సినీ కెరీర్ ముగుస్తుంది అని చెప్పారట. అయితే ఆ మాటలు విని బహుశా పెళ్లి చేసుకుని కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అనుకున్నాం. కానీ ఇలా జీవితమే ముగుస్తుందని ఊహించలేదు అంటూ గుర్తుచేసుకున్నారట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు