Tollywood Star Hero: 10 నిమిషాల కోసం రూ.100 కోట్లు.. ఏం డిమాండ్ రా బాబు..!

Tollywood Star Hero: ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోలు సినిమాలలో సక్సెస్ పొంది.. అదే సినిమాల ద్వారా భారీ క్రేజ్ లభించేందంటే చాలు యాడ్స్లో నటించేస్తూ ఉంటారు అయితే అక్కడ క్రేజ్ పెరిగితే ఇక్కడ రెమ్యునరేషన్ కూడా పెంచేస్తారనటంలో సందేహం లేదు. ఈ మధ్యకాలంలో హీరోల వల్ల బడ్జెట్ పెరిగిపోతోంది. ఫలితంగా నిర్మాతలు కూడా లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక స్టార్ హీరో రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఏకంగా 10 నిమిషాలకి ఏకంగా రూ.100 కోట్లు తీసుకున్నారట.. ఇంతకు ఏ సినిమా కోసం..? ఎవరా హీరో..? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

Tollywood Star Hero: Rs.100 crores for 10 minutes.. What is the demand Ra Babu..!
Tollywood Star Hero: Rs.100 crores for 10 minutes.. What is the demand Ra Babu..!

ఇండియాలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో భారీ పారితోషకం తీసుకునే హీరోలు అనగానే.. వెంటనే చాలామంది రజనీకాంత్, ప్రభాస్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ పేర్లు చెప్పేస్తారు.. వీరి పారితోషకం కూడా రూ.100 కోట్ల పైమాటే. అయితే అది సినిమా మొత్తానికి కలిపి రూ.100 కోట్లు . కానీ వీళ్ళు ఎవరూ కాకుండా ఒక హీరో మాత్రం పది నిమిషాలు సినిమాలో కనిపించినందుకు ఏకంగా రూ .100 కోట్లు బిల్ వేశారట.. ఆయన ఎవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్.. కేవలం 10 నిమిషాల కోసం ఏకంగా రూ .100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమాలో కమల్ హాసన్ పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. సుప్రీమ్ యాస్కిన్ పాత్రను కమలహాసన్ పోషించారు..

ఇందులో అన్ని పాత్రలు ఒక ఎత్తు అయితే కమలహాసన్ పాత్ర మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది ఈ పాత్రలో ఆయనను అంత ఈజీగా ఎవరు గుర్తుపట్టరు ఇక్కడ ఉన్నది కమలహాసన్ అని చెప్పిన సరే గుర్తుపట్టం అసాధ్యం అంతలా తన మేకోవర్ మార్చుకున్నారు కమల్ హాసన్. ఏకంగా మేకప్ వేయడానికి మూడు గంటలు తీయడానికి రెండు గంటలు సమయం పట్టేదట ఈ ఛాలెంజింగ్ పాత్రను ఇంత పర్ఫెక్ట్ గా పెర్ఫామ్ చేశారు కాబట్టే ఈ రేంజ్ లో పారితోషకం తీసుకున్నారని సమాచారం..

- Advertisement -

ఇక ఈ పాత్రలో కమల్ హాసన్ ను తప్పించి ఇంకొకరిని ఊహించలేరు.. కమల్ హాసన్ ఏ సినిమాలో కనిపించింది కేవలం 10 నిమిషాల కంటే తక్కువ నిడివి.. చాలా చిన్న పాత్ర అయినా సరే మొత్తం సినిమా కథనే మార్చేశాడు. ఇక అందుకే కమల్ హాసన్ కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పది నిమిషాల కోసం ఏకంగా రూ .100 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారట కమల్ హాసన్.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..

ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే ..ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నారో చూడాలి. మొత్తానికి అయితే 10 నిమిషాల కోసం రూ .100 కోట్ల రెమ్యూనరేషన్ అని తెలిసి ఈయన క్రేజ్ కి ఎంత డిమాండ్ రా బాబు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు