Tollywood : టైర్ 2 హీరోల సినిమాలకు భారీ నష్టాలు.. లెక్కలు మారాల్సిందే అంటున్న నిర్మాతలు..!

Tollywood : టాలీవుడ్ లో లాక్ డౌన్ తరవాత టాప్ హీరోల సినిమాలతో పాటు, టైర్2 స్టార్ హీరోల సినిమాల లెక్కలు కూడా మారాయన్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు ఊహించని విజయం సాధించే సరికి టైర్ 2 హీరోల సినిమాల బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయి. మామూలుగా టైర్ 1 హీరోల సినిమాలు బాగుంటే వీకెండ్ లోనే ఇప్పుడు 100 కోట్ల వసూళ్లు వచ్చేస్తున్నాయి. ఇక టాక్ ని బట్టి 200 అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా నెమ్మదిగా 100 కోట్ల వరకు సాధించే సినిమాలు రూపొందుతున్నాయి. ఇది వరకు మీడియం రేంజ్ హీరోల మార్కెట్ 30 – 40 కోట్ల రేంజ్ లో ఉండేది. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. కానీ ఇప్పుడు టాక్ బాగుంటే 50-60 కోట్ల రేంజ్ దాకా వసూళ్లు సాధిస్తున్నాయి. 60 నుండి 70 కోట్ల మధ్య షేర్ ని 100 కోట్ల గ్రాస్ ని కూడా అందుకుంటున్నాయి. కానీ అదే టైంలో టాక్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా టాప్ స్టార్ మూవీస్ కన్నా కూడా భారీ నష్టాలు మీడియం రేంజ్ మూవీస్ కి వస్తున్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

Tollywood tier2 hero movies that lost due to over budget

అపరిమిత బడ్జెట్టే కారణం!

ఇక టైర్ 2 హీరోల సినిమాలు ఈ మధ్యకాలంలో దారుణంగా పరాజయం పాలయ్యాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రామ్ స్కంద వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలి నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. అయితే మరీ ఇంత దారుణమైన నష్టాలు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల బడ్జెట్ లు భారీగా పెరిగిపోవడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన హీరో మార్కెట్ ని మించి 60 నుండి 70 కోట్ల వరకు మీడియం రేంజ్ హీరోలకు ఖర్చు పెడుతున్నారు మేకర్స్. కానీ ఆ సినిమాలు బోల్తా కొడితే ఏ రేంజ్ లో దెబ్బ తింటారో రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో తెలిసొచ్చింది. అయితే నష్టాలు వచ్చినా మేకర్స్ భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధం అవ్వడానికి కారణం ఆ సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగా జరగడమే. కానీ రీసెంట్ టైంలో ఇది మరీ ఓవర్ అయిపోయి OTT వాళ్ళకి కూడా భారీగా వ్యూవర్ షిప్ పడిపోయి నష్టాలు వస్తూ ఉండటంతో, ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్నా చాలా మీడియం రేంజ్ మూవీస్ రైట్స్ అస్సలు అమ్ముడుపోవడం లేదట. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒకటి రెండు సినిమాలు తప్పితే చాలా సినిమాల నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోక పోవడం మునుపటిలా మీడియం రేంజ్ హీరోల సినిమాలు వరుస పెట్టి రిలీజ్ లను సొంతం చేసుకోవడం లేదని టాలీవుడ్ (Tollywood) లో స్ట్రాంగ్ గా బజ్ ఉంది.

- Advertisement -

రెమ్యూనరేషన్ కూడా ఓవర్ గా పెంచడం?

ఇక మీడియం రేంజ్ సినిమాలు భారీ ప్లాప్ కావడానికి, బడ్జెట్ పెరగడానికి మరో రీసన్ హై రెమ్యూనరేషన్ కూడా కారణమని అంటున్నారు. మామూలుగా టాలీవుడ్ లో టైర్ 2 హీరోల రెమ్యూనరేషన్ 10 నుండి 12 కోట్ల రేంజ్ లో ఉంటుంది. ఇంకా సినిమా రేంజ్ ని బట్టి లాభాల్లో వాటా తీసుకుంటారు. కానీ ఇప్పుడు టైర్ 2 హీరోలు కొందరు వాళ్ళ మార్కెట్ ని మించి హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. సినిమా మంచి హిట్ అయితే పెద్దగా పట్టించుకోరు కానీ, ప్లాప్ అయితే మాత్రం దారుణమైన నష్టాలు వస్తున్నాయి. సినిమా మీద నమ్మకంతో రిలీజ్ చేసి అనుకున్న రేంజ్ కి ఎక్కువ హిట్ అయితే రెమ్యూనరేషన్ తీసుకోవచ్చుగాని, ఇలా 20 కోట్లు 25 కోట్లు అంటే ఆ సినిమాలు ఏమి వంద కోట్ల వసూళ్ళని అందుకోవడం లేదు కదా అని పలువురు నిర్మాతలు అంటున్నారు. ఇకనైనా హీరోలు, మేకర్స్ మారి లిమిటెడ్ టైం లో కరెక్ట్ బడ్జెట్ ని మైంటైన్ చేయాలనీ, హీరోలు కూడా సినిమాని, మార్కెట్ ని బట్టి రెమ్యూనరేషన్ తీసుకోవాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. మరి దీనిపై హీరోలు, దర్శక, నిర్మాతలు సరైన స్టెప్స్ తీసుకుని ముందు ముందు ఇలాంటి పరిస్థితులను ఎలా చక్కదిద్దితారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు