Salaar 2 Update : ప్రభాస్ ‘శౌర్యంగ పర్వం’ లో మరో పాన్ ఇండియా విలన్..?

Salaar 2 Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “సలార్” లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హోంబేలె ఫిలిమ్స్ వారు నిర్మించడం జరిగింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ సమయంలో ఎంత భారీ అంచనాలుండేవో తెలిసిందే. పృత్వి రాజ్ సుకుమారన్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే భారీ హిట్ కాగా, కెరీర్ లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా ఇది వచ్చింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 700 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఇక ఈ సినిమా రెండో పార్ట్ గా త్వరలోనే సలార్ పార్ట్ 2 గా “శౌర్యంగ పర్వం” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇక సలార్ సినిమా రీసెంట్ గా మన తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాగా యావరేజ్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక సలార్ పార్ట్ వన్ లో ప్రభాస్ ఎవరో రివీల్ కాగా, రెండో పార్ట్ “శౌర్యంగ పర్వం” త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే సలార్ పార్ట్ 2 లో మరో క్రేజీ నటుడు విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

'Tom Shine Chacko' as another villain in Prabhas Salaar 2

శౌర్యంగ పర్వం లో పాన్ ఇండియా విలన్?

ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కానీ ప్రభాస్ లేకుండానే త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నాలలో ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా ప్రభాస్ చిన్నప్పటి సన్నివేశాలని చిత్రీకరించిన తర్వాత శౌర్యంగ పర్వంలోకి ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడట. ఈ లోపు ప్రభాస్ కల్కి 2898AD, రాజా సాబ్ సినిమాల షూటింగ్ పూర్తి చేసేస్తాడని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. సలార్ 2 లో మరో పాన్ ఇండియా విలన్ భాగం కానున్నాడట. మలయాళ విలక్షణ నటుడైన “షైన్ టామ్ చాకో” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాస్ట్ ఇయర్ దసరా తో తెలుగులో కూడా అద్భుతమైన విలన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సలార్ 2 లో మరో విలన్ గా షైన్ టామ్ నటించబోతున్నాడని సమాచారం.

- Advertisement -

కల్కి రిలీజ్ కాగానే..

ఇక ప్రస్తుతం కల్కి 2898AD, రాజా సాబ్ సినిమాల షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. ఇందులో కల్కి రిలీజ్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో శౌర్యంగ పర్వం (సలార్ పార్ట్ 2) మొదలు పెట్టేస్తాడు ప్రభాస్. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 ఈ లోపు చేద్దామనుకున్నా, ఎన్టీఆర్ దేవర, వార్ 2 లతో బిజీగా ఉన్నాడు. పైగా సలార్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన పిల్లలు పెద్దవారు అవుతుండడంతో త్వరలోనే సలార్ 2 (Salaar 2 Update) మొదలుపెట్టి ముందు వారిపై సీన్లు షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇక రాజా సాబ్ ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేసి, శౌర్యంగ పర్వాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు