Trisha: స్టార్ హీరో కోసం విదేశాలకు చెక్కేస్తున్న త్రిష… చెప్పాపెట్టకుండా ఈ ప్లాన్ ఏంటి?

Trisha: చెన్నై చిన్నది త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కోలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ చివరగా లియో మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే త్రిష గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో కోసం ఆమె విదేశాలకు చెక్కేస్తుందనే వార్త బయటకు వచ్చింది. మరి త్రిష ఎవరి కోసం ఎక్కడికి వెళ్లబోతోంది? అనే విషయంలోకి వెళ్తే…

స్టార్ హీరో కోసం సైలెంట్ గా విదేశాలకు…

మిస్ చెన్నై టైటిల్ ని గెలుచుకున్న త్రిష అనతి కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే త్రిష హిందీలో ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో డైరెక్టర్ విష్ణువర్ధన్ ఓ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమాకు ది బుల్ అనే టైటిల్ విన్పిస్తోంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోందని అంటున్నారు. అయితే విష్ణువర్ధన్ చాలావరకు ఈ సినిమాలోని సన్నివేశాలను స్పెయిన్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రిష కూడా వీలైనంత త్వరగా చిత్ర బృందంతో కలిసి స్పెయిన్ కి వెళ్ళబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చెప్పాపెట్టకుండా త్రిష ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసుకుంటోందా అని కామెంట్స్ చేస్తున్నారు ఆమె అభిమానులు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.

Trisha to play the female lead in Salman Khan-Vishnuvardhan film

- Advertisement -

స్టార్ హీరోతో ఎఫైర్

ఇటీవల కాలంలో త్రిష తన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలిచింది. ముందుగా లియో సినిమా వివాదం, రీసెంట్ గా విజయ్ తో ఎఫైర్ కారణంగా ఆమె పేరు మార్మోగిపోయింది. విజయ్ పుట్టినరోజున లిఫ్ట్ లో ఆయనతో పాటే త్రిష కూడా ఉన్న ఫోటోను పోస్ట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పడమే ఈ వివాదానికి కారణమైంది. అలాగే ఆ తర్వాత త్రిష, విజయ్ చాలాసార్లు సినిమాల పరంగా కాకుండా ప్రైవేట్ గా ఒకేచోట కలిసి ఉన్నారు అని హింట్ ఇచ్చే విధంగా ఉన్న ఫోటోలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వివాదంపై అటు త్రిష గానీ, ఇటు విజయ్ గానీ స్పందించలేదు.

త్రిష కిట్టిలో క్రేజీ ప్రాజెక్ట్స్

అజిత్ తో ఓ మూవీ, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తోంది. అలాగే థగ్ లైఫ్ లో కమల్ హాసన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. గౌరవ్ నారాయణన్ దర్శకత్వం వహించిన చిత్రం బృందా అనే వెబ్ సిరీస్ లో కూడా త్రిష నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు