Trisha – Vijay: అప్పుడు అర్థం కాలా.. మొత్తానికి దొరికేసారుగా .?

Trisha – Vijay.. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా స్పందించడం లేదు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు ఇటీవల త్రిష రీ ఎంట్రీ ఇచ్చి విజయ్ తో కలిసి నటించిన లియో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. వీరిద్దరి కాంబోకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు. అందుకే ఈ జంట సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటుంది

త్రిష – విజయ్ ప్రైవేట్ ఫోటోలు వైరల్..

Trisha - Vijay: Then you mean when.. as soon as you get it..?
Trisha – Vijay: Then you mean when.. as soon as you get it..?

ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం విజయ్ 50వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. త్రిష తన సోషల్ మీడియా వేదికగా.. విజయ్ తో ఈమె లిఫ్ట్ లో ఉన్న ప్రైవేట్ ఫోటోని షేర్ చేయడంతో పాటు.. “నీ థాన్ ఎన్ కాదల్.. టిల్ డెత్ నీ థాన్ ఎన్ కాదల్” అంటూ ఒక పాటను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఇక దీంతో వీరిద్దరూ కలిసిన పాత ఫోటోలను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అంతేకాదు ఇన్ని రోజులు చాలా సందర్భాలలో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారు.. కానీ అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు ఏకంగా త్రిష ఇలాంటి పాటను కూడా జోడించడంతో ఇద్దరు రహస్యంగా రిలేషన్ లో ఉన్నారా..? అంటూ వార్తలు వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం..

పాత ఫోటోలు ప్రూఫ్..

ఇకపోతే వీళ్ళిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లారు అంటూ కామెంట్లు చేయడమే కాదు అందుకు సంబంధించిన పాత ఫోటోలను ఆధారంగా చూపిస్తూ వైరల్ చేస్తున్నారు.. ఇక ఆ ఫోటోల విషయానికి వస్తే.. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉండగా.. మరో ఫోటోలు త్రిష పక్కన.. కాలుతో ఉన్న ఫోటో ఉంది..ఇక ఈ రెండు ఫోటోలను కలిపి ఇప్పుడు అక్కడ విజయ్ వేసుకున్న షూ ని హైలెట్ చేస్తూ రెడ్ మార్కు కూడా పెట్టారు.. దీంతో ఈ రెండు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఆ ఫోటోలలో ఒంటరిగా నడుస్తున్నప్పుడు విజయ్ ఏదైతే షూ ధరించారో.. అదే షూ త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తూ ఉండడంతో తరచూ త్రిష, విజయ్ విదేశాలకు వెళ్లారని.. ఇంతకంటే మరో రుజువు అవసరం లేదని.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనడానికి ఇదే పెద్ద నిదర్శనం అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు చర్చలు మొదలయ్యాయి.

- Advertisement -

రూమర్స్ పై ఫ్యాన్స్ ఫైర్..

అయితే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఈ జంట అభిమానులు.. కావాలనే కొన్ని ఫోటోలను ఆధారంగా చేసి వారి మధ్య ఏదో ఉందనే చర్చ మొదలుపెట్టారు.. వీరిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే.. ఎటువంటి తప్పుడు రిలేషన్ లో వీరు లేరు అంటూ ఈ జంటకు అండగా నిలుస్తున్నారు.

విజయ్ – త్రిష స్పందించాల్సిందే..

ఇకపోతే విజయ్ కి ఆల్రెడీ వివాహం జరిగి.. ఒక కొడుకు కూడా జన్మించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం విజయ్ భార్య అమెరికాలో ఉంటున్నారు.. సినిమాలు, రాజకీయాల నిమిత్తం విజయ్ చెన్నైలోనే ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే విడిగా ఉంటున్నారని కామెంట్లు కూడా చేస్తున్నారు. త్వరలోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ కొత్త వార్తలు తెరపైకి తీసుకొస్తున్నారు.. మొత్తానికైతే ఈ విషయాలపై క్లారిటీ రావాలి అంటే త్రిష లేదా విజయ్ ఎవరో ఒకరు స్పందిస్తే ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు