Nani – Trivikram Movie : “గుంటూరు కారం” ఎఫెక్ట్ తో రూటు మారుస్తున్న గురూజీ… నానితో ఇలాంటి స్టోరీ వర్కౌట్ అవుతుందా?

సంక్రాంతి సీజన్ లో “గుంటూరు కారం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గురూజీ, ఆ మూవీ ఇచ్చిన రిజల్ట్ ఘాటు దెబ్బకు రూటు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు మాస్ ఎలిమెంట్స్ ను కలిపి “గుంటూరు కారం” మూవీని రూపొందించిన త్రివిక్రమ్ ఇప్పుడు నానితో తన నెక్స్ట్ మూవీ కోసం “జులాయి” బాట పట్టనున్నట్టు సమాచారం.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి, నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీనంతటికీ కారణం గురూజీనే అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో దారుణమైన ట్రోలింగ్ బారిన పడిన త్రివిక్రమ్ ఆ తర్వాత ఎక్కడా కన్పించలేదు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా గురూజీ నేచురల్ స్టార్ నానితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అని ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాని, త్రివిక్రమ్ కాంబో 90% ఫైనల్ అయినట్టే అని తెలుస్తోంది. అయితే ఈసారి ఎప్పటిలా ఫ్యామిలీ స్టోరీని కాకుండా, నాని కోసం రూటు మార్చి క్రైమ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడట త్రివిక్రమ్. అది కూడా “జులాయి” లాంటి స్టోరీతో గురూజీ రాబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఇయర్ ఎండ్ లోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

వాస్తవానికి ముందుగా ఈ స్టోరీ కోసం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని అనుకున్నారట. కానీ ఫైనల్ గా నాని సెట్ అయ్యేలా ఉన్నాడు. ఇక నాని స్టోరీ సెలక్షన్ గానీ, యాక్టింగ్ గాని ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జానర్ ఏదైనా తనదైన స్టైల్ లో ఇరగదీస్తాడు నాని. కామెడీతో కలగలిసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఆయన హీరోగా నటించిన “భలే భలే మగాడివోయ్” మూవీ ఇప్పటికీ ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది.

కాబట్టి నిజంగానే “జులాయి” లాంటి స్టోరీ నానికి పడితే కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టరే. త్రివిక్రమ్ కు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జానర్ మార్చడం చాలా ముఖ్యం. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబోలో “జులాయి” లాంటి క్రైమ్, కామెడీ, యాక్షన్, లవ్ కలగలిసిన అంశాలతో ఓ మూవీ రూపొందనుంది అనే వార్త వైరల్ అవుతోంది. కాగా ఈ ప్రాజెక్ట్ పై మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు