Trivikram: మెగాస్టార్ చిరంజీవితో సినిమా త్రివిక్రమ్ కల నెరవేరబోతుందా.?

Trivikram: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అతి కొద్ది మంది మాత్రమే మెగాస్టార్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటారు. అయితే మెగాస్టార్ తో సినిమా చేయాల్సిన లిస్టులో ఇద్దరు దర్శకులు ఎప్పుడు ముందుంటారు. కానీ ఇప్పటివరకు వాళ్ళు సినిమా చేయలేకపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ వీరిద్దరూ కలిసి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తారు అంటూ చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. కానీ ఇది మాత్రం జరగలేదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ సినిమా ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా సినిమాను చేయబోతున్నాం అంటూ ఆన్ స్టేజ్ అనౌన్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి ఒక అప్డేట్ కూడా లేదు. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Trivikram With Chiranjeevi

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అది అనౌన్స్ చేసిన తర్వాత రెండు సినిమాలు చేశారు. బాబీ దర్శకత్వంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి 100% సక్సెస్ అయ్యాడు బాబి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 2025లో విడుదల కానుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు