Aadikeshava : పాపం… అల్లు అర్జున్ ని వాడుకున్నా వర్కౌట్ కాలేదే?

పంజా వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “ఆదికేశవ”. ఈ ఫ్రైడే థియేటర్లోకి వచ్చిన “ఆదికేశవ” మూవీకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఫస్ట్ డేనే ఈ మూవీపై నెగిటివ్ టాక్ నడుస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే వచ్చిన కొన్ని మాస్ సినిమాల సన్నివేశాలను తీసుకొచ్చి ఈ సినిమాను తెరకెక్కించారంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కన్నా రీసెంట్ గా వచ్చిన బోయపాటి “స్కంద” మూవీనే బెటర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి వైష్ణవ్ తేజ్ ను గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు పలకరిస్తున్నాయి. ‘ఉప్పెన’ తర్వాత ఈ యంగ్ హీరోకు సరైన హిట్ పడలేదు. ఆ మూవీ వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆయన ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. మొదటి సినిమాతో 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత ఆయన చేసిన ‘కొండ పొలం’, ‘రంగరంగ వైభవంగా’ వంటి సినిమాలు మెగా ఫ్యాన్స్ కు నిరాశనే మిగిల్చాయి. తాజాగా వచ్చిన ‘ఆదికేశవ’ సినిమాపైనే వైష్ణవ తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి అల్లు అర్జున్ ను సైతం వాడుకున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ గా సూపర్ క్రేజ్ అందుకుంటున్నాడు. బన్నీకి ఉన్న ఆ సాలిడ్ క్రేజ్ ని వాడుకోవాలని ‘ఆదికేశవ’ టీం ప్రయత్నించింది. అందుకే ‘ఆదికేశవ’ మూవీలో ‘పుష్ప’ మూవీలోని ఓ సాంగ్ ను రిఫరెన్స్ గా తీసుకుని వాడుకున్నారట. నిజానికి ‘పుష్ప’ ఫీవర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉంది. ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. కానీ ‘ఆదికేశవ’ మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈ సినిమాలో ‘పుష్ప’ మూవీ నుంచి రిఫరెన్స్ తీసుకున్నారని మాట్లాడడానికి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు. ఆ రేంజ్ లో సినిమాపై నెగిటివ్ టాక్ నడుస్తోంది.

- Advertisement -

దీంతో పాపం… అల్లు అర్జున్ వాడుకున్నా వర్కౌట్ కాలేదే అంటూ నెటిజెన్లు ‘ఆదికేశవ’ మూవీ టీంపై కామెంట్స్ చేస్తున్నారు. పైగా తన సినిమాల విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా కన్పించే నాగవంశీ కూడా ఈ మూవీ విషయంలో కాస్త తడబడ్డాడు. ఇక శ్రీలీలకు కూడా ఈ మూవీ మైనస్ అయ్యిది. మరి ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు