Acharya : యూటర్న్.. టార్గెట్ వరంగల్ శ్రీను

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కిన సినిమా ఆచార్య. సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరున్న కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గత నెల 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, కేవలం 80 కోట్ల కలెక్షన్లు మాత్రమే చేసి డిజాస్టార్ గా మిగిలింది.

ఈ మూవీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టపోయారు. రిలీజ్ కు ముందు ప్రీ బిజినెస్ వల్ల నిర్మాతలకు కాస్త ఊరట వచ్చినా.. డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రం కోలుకోలేని దెబ్బ పడింది. తమను ఆదుకోవాలని ఈ సినిమాతో నష్టపోయిన ఎగ్జిబిటర్లు.. చిరంజీవి, రామ్ చరణ్ ను కోరుతున్నారు. ఓ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ అయితే మెగాస్టార్ కే బహిరంగ లేఖ రాశాడు.

ఇదిలా ఉండగా.. నైజం ఏరియాపై దిల్ రాజ్ డామినేషన్ పెరుగుతున్న తరుణంలో వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ రంగంలోకి దిగాడు. ఆచార్య సినిమాను దిల్ రాజ్ తో పోటీ పడి 45 కోట్లకు దక్కించుకున్నాడు. దిల్ రాజ్ ను ఢీ కొట్టే వాడు వచ్చాడని ట్రేడ్ వర్గాలు అనుకున్నాయి.

- Advertisement -

కానీ అనూహ్యంగా ఆచార్య భారీ డిజాస్టార్ తో నిరాశ పర్చింది. ఫలితంగా వరంగల్ శ్రీను 50 శాతం మేరకు నష్టపోయాడు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న వరంగల్ శ్రీనుకు కొత్త తలనొప్పులు వస్తున్నట్టు తెలుస్తుంది. వరంగల్ శ్రీనును ఆచార్య సినిమాతో నష్టపోయిన ఎగ్జిబ్యూటర్లు పరిహారం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

కరోనా మహమ్మారితో ఇప్పటికే తీవ్ర నష్టాలను చూసిన ఎగ్జిబ్యూటర్స్, ఆచార్య సినిమాతో వచ్చిన భారాన్ని మెగా హీరోలతో భర్తీ చేయాలని భావించారు. కానీ చిరంజీవి దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో డిస్ట్రీబ్యూటర్ వరంగల్ శ్రీనుతో తెల్చుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు