Vaishnavi Chaitanya : మహేష్ – జక్కన్న మూవీలో ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. ఏ పాత్రలో అంటే..!

Vaishnavi Chaitanya in ssmb29: ప్రెసెంట్ టాలీవుడ్ ప్రేక్షకులే కాదు ప్రతి ఇండస్ట్రీ వారి దృష్టి మహేష్ – జక్కన్న సినిమా పైనే ఉంది. ఈ మూవీ గురించి ఎప్పుడైతే మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిందో అప్పటినుంచి నిత్యం ఏదో ఒక వార్త ఈ మూవీపై చెక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చిన మహేష్ బాబు మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నాడు.

దీంతో తన తదుపరి చిత్రంపై ఫుల్ హోప్స్ పెట్టుకున్నాడు మహేష్. జక్కన్నతో సినిమా అంటే సగం హిట్ అయిపోయినట్లే. ఇక ఇప్పటికే మహేష్ బాబు తన మేకవర్ పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ లో ఓ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Vaishnavi Chaitanya who got a chance in Mahesh - Jakanna movie
Vaishnavi Chaitanya who got a chance in Mahesh – Jakanna movie

బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన వైష్ణవి చైతన్య ఈ మూవీలో మహేష్ కి చెల్లి గా నటించబోతున్నట్లు సమాచారం. మహేష్ కి చెల్లి పాత్రలో మరే స్టార్ హీరోయిన్ అయినా సరిగా సెట్ కాదని వైష్ణవి చైతన్య అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించిన జక్కన్న ఈ డెసిషన్ తీసుకున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో ఆపర్చునిటీ దక్కడంతో వైష్ణవి చైతన్య కూడా నిమిషం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు