Varalakshmi Sarath Kumar Wedding : విదేశాల్లో ప్రియుడితో వరలక్ష్మి వెడ్డింగ్… రిసెప్షన్ ఎక్కడో తెలుసా?

Varalakshmi Sarath Kumar Wedding : కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి సౌత్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ నటిస్తూ లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి 38 ఏళ్ల వయసులో పెళ్ళికి సిద్ధమైంది. త్వరలో తన ప్రియుడు నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఈ బ్యూటీ పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఆమె పెళ్ళికి సంబంధించిన సన్నాహాలు మొదలు కాగా, ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి ఎక్కడ జరుగుతుంది?రిసెప్షన్ ను ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అనే సమాచారం బయటకు వచ్చింది.

నార్త్ స్టైల్ లో పెళ్లి

శరత్‌ కుమార్ పెద్ద కుమార్తె, నటి వరలక్ష్మి ఆమె చిరకాల స్నేహితుదు నికోలాయ్ సచ్‌దేవ్ ఇటీవల ముంబైలోని ఒక స్టార్ హోటల్‌లో చాలా సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందే చాలాకాలం డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైంది. తన కూతురు పెళ్లిని నార్త్ స్టైల్‌లో జరపాలని శరత్‌ కుమార్ నిర్ణయించుకున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు చేస్తున్నాయని అంటున్నారు. అందులో భాగంగానే పెళ్ళికి సంబంధించిన ఒక్కో వేడుకను ఎక్కవ ఐకానిక్ ప్లేస్ లో జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.

చెన్నైలో మెహందీ వేడుక

జూలై 2న వరలక్ష్మి శరత్‌ కుమార్, నికోలా సచ్‌దేవ్‌ల వివాహం జరగబోతోందని సమాచారం. పెళ్లికి ముందు రోజు చెన్నైలోని తాజ్ హోటల్‌లో వారి మెహందీ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. పెళ్లిని థాయ్‌లాండ్‌లో జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకోవడంతో.. నికోలా సచ్‌దేవ్ కుటుంబీకులు దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.

- Advertisement -

Varalaxmi Sarathkumar gets engaged to Nicholai Sachdev; See Pics

రిసెప్షన్ ఎక్కడంటే?

వివాహానంతరం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో వరలక్ష్మి, నికోలా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుందని, దీనికి పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతారని టాక్ నడుస్తోంది. పెళ్ళికి మాత్రం కేవలం ఇరు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు.

వరలక్ష్మికి నో ఆఫర్స్

బోడ బోడి సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించినప్పటికీ మంచి విమర్శకుల ఆదరణ పొందింది. ప్రధానంగా వరలక్ష్మి తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా సంచలనం సృష్టిస్తుంది అనుకున్న వరలక్ష్మికి మొదట్లో పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పడు మాత్రం హనుమాన్ వంటి పాన్ ఇండియా సినిమాలో నటించి లక్కీ గర్ల్ గా ఇండస్ట్రీలో ముద్ర వేసుకుంది. రీసెంట్ గా శబరి మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

శరత్ కుమార్ మొదటి భార్య కూతురు

విలన్‌గా అరంగేట్రం చేసి తమిళ చిత్రసీమలో హీరోగా మారిన నటుల్లో శరత్‌కుమార్ ఒకరు. నటుడిగానే కాకుండా పాత్రికేయుడు, రాజకీయవేత్త అయిన శరత్‌కుమార్ మొదటి భార్య సాయకు వరలక్ష్మి, పూజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శరత్‌ కుమార్‌కు రెండో భార్య రాధికకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.

నికోలాతో వరలక్ష్మికి రెండో పెళ్లి

వరలక్ష్మి మొదట్లో విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు మొదట్లో పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. నికోలాయ్ అప్పటికే వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. ఇప్పటికే  15 ఏళ్ల కూతురు ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు