Varalakshmi Sarath Kumar: ఆమె నా తల్లి కాదు.. రాధిక పై షాకింగ్ కామెంట్స్..!!

సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి చాలామంది అమ్మాయిలు హీరోయిన్ లుగా పలు రకాల ఇండస్ట్రీల నుంచీ పరిచయమవుతున్నారు.. అయితే ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.. అలాంటివారిలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు.. అందం, అభినయంతో పాటు తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. అయితే హీరోయిన్ గా సక్సెస్ రేట్ తక్కువగా ఉండడంతో విలన్ గా అడుగులు వేస్తూ ఆ వైపుగా దూసుకుపోతోంది. ఇలా వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో.. గడిచిన కొద్దిరోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది..

వరలక్ష్మి ఎంట్రీ..
ఈ నేపథ్యంలోని ఒక న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ.. తన సవతి తల్లి రాధిక పైన వరలక్ష్మి శరత్ కుమార్ పలు రకాలుగా కామెంట్స్ చేసింది.. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యానని.. అలాగే పోడాపోడి అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను అని తెలియజేసింది.. ఆ తర్వాత కన్నడతో పాటు ఎన్నో భాషలలో నటించి భారీ క్రేజ్ సంపాదించుకుంది.. హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో హీరో విశాల్ తో ప్రేమాయణం సాగించినట్లు వార్తలయితే వినిపించాయి కానీ తామిద్దరం మంచి స్నేహితులమంటూ ఎన్నో సందర్భాలలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు చిత్రాలు..
తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది.. దీని తర్వాతే రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.. ఆ తర్వాత నాంది, యశోద, వీర సింహారెడ్డి, హనుమాన్ వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకుంది. ప్రస్తుతం తెలుగులో శబరి అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇతర భాషలలో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నికోలమ్ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో నిశ్చితార్థం చేసుకుంది.

- Advertisement -

రాధిక పై వరలక్ష్మీ కామెంట్స్..
శరత్ కుమార్, ఛాయా దంపతులకు వరలక్ష్మి శరత్ కుమార్ జన్మించింది. అయితే ఆ తర్వాత శరత్ కుమార్ హీరోయిన్ రాధికను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి వరలక్ష్మి శరత్ కుమార్ తో సత్సంబంధాలు రాధిక కొనసాగిస్తూనే ఉంది.. ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను తెలియజేసింది వరలక్ష్మి శరత్ కుమార్.. రాధిక నా తల్లి కాదు.. కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.. అలాగే నా కెరీర్ కు సంబంధించి ఎన్నో సూచనలను కూడా ఇస్తుంది.. కానీ ఏదైనా సీక్రెట్ ఆమెకు చెబితే వెంటనే వాటిని లీక్ చేస్తుంది.. అలా నన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టింది అంటూ తెలిపింది.. అయితే ఆమె అలా కావాలని చేయదు కానీ పొరపాటున జరిగిపోతూ ఉంటుందని వివరించింది వరలక్ష్మి శరత్ కుమార్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు