Racharikam : సరికొత్త మేకోవర్ లో వరుణ్ సందేశ్.. నవదీప్ రూట్లో వెళ్తున్నాడా?

Racharikam : టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమా తో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ మంచి లవర్ బాయ్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఆ సినిమా మొదలైన కొత్తలో ఏకంగా అరడజను సినిమా ఆఫర్లతో చిన్న హీరోల్లో ఫుల్ బిజీ అయి వరుస సినిమాలు చేసాడు. ఆ తర్వాత కూడా కొత్త బంగారు లోకం సినిమాతో మరో హిట్ కొట్టి జోరు చూపించాడు. అప్పట్లో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ ఆ సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ నటించిన సినిమాలు, ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సక్సెస్ ని దక్కించుకోలేక పోయాయి. దీంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్, తన వైఫ్ వితికా శేరుతో కలిసి రియాలిటీ షో బిగ్ బాస్ లో కనిపించాడు. హౌస్ లో తనదైన ఆటతీరుతో అందరినీ మెప్పించిన వరుణ్, ఆ తరువాత కూడా పలు టివి షోలలో సందడి చేసాడు. బాగా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా నింద అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది.

Varun Sandesh first look released in Racharikam

సరికొత్త మేకోవర్ లో వరుణ్…

ఇదిలా ఉండగా వరుణ్ సందేశ్ తాజాగా “రాచరికం” (Racharikam) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అప్సరా రాణి, విజయ్ శంకర్ లు కూడా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. సురేష్ లంకలపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇంతకు ముందే అప్సర రాణి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచగా, తాజాగా వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్బంగా తన పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. వరుణ్ ఫస్ట్ లుక్ లో చాలా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటున్నాడు. అయితే ఆ లుక్ ని చూస్తుంటే వరుణ్ ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ ఏమైనా చేస్తున్నాడా అని అనిపిస్తుంది.

- Advertisement -

వరుణ్ నవదీప్ రూట్లో వెళ్తున్నాడా?

అయితే వరుణ్ సందేశ్ ఇప్పుడు ఇతర హీరోల్లా కెరీర్ లో టర్న్ తీసుకోబోతున్నాడా అని అనిపిస్తుంది. నవదీప్ కూడా ఇలాగే లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి వరుస ఫెయిల్యూర్స్ తరవాత విలన్ గా మారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక వరుణ్ సందేశ్ కూడా మొన్నటివరకు హీరోగా చేసి ఒక్క సక్సెస్ కూడా కొట్టకపోగా, ఆ మధ్య మైకేల్ లో ఒకసారి నెగిటివ్ రోల్ లో కనిపించాడు. ఇప్పుడు మళ్ళీ రాచరికంలో విలన్ గా నటిస్తున్నాడేమో అని వార్తలు వస్తున్నాయ్. ఏది ఏమైనా వరుణ్ ఇక హీరోగా కాకుండా నవదీప్ లాంటి హీరోలలా అన్ని రకాల పాత్రలు కూడా వేస్తూ ఇతర హీరోల సినిమాల్లో కూడా నటిస్తే కెరీర్ నిలబడుతుంది అంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు