Varun Tej : తొలి పాన్ ఇండియా చిత్రం ?

టాలీవుడ్ లో హీరోలు అందరూ పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేయాలనే చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలకు సైన్ చేశారు. తాజాగా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. మెగా కాంపౌండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్, తొలి సినిమా ముకుందాతోనే విజయాన్ని అందుకున్నాడు. తర్వాత వచ్చిన కంచెతో కూడా మంచి టాక్ తెచ్చుకున్నాడు. అలాగే తొలి ప్రేమతో హిట్ ను అందుకున్నాడు. ఇక ఎఫ్2, ఎఫ్3 గురించి చెప్పాల్సిన పని లేదు.

కాగ మెగా ప్రిన్స్ ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమా పూర్తిగా యాక్షన్ జోనర్ లోనే వస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ ఒక భారీ ప్రాజెక్ట్ కు సంతకం చేశాడని సమాచారం అందుతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఉండే ఒక ఆసక్తికర స్టోరీతో సినిమా చేస్తున్నాడని వినికిడి.

భారీ ప్రాజెక్ట్ ను సోనీ పిక్చర్స్ నిర్మిస్తుందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చే ఈ సినిమాను ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించనున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రటకన రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. అప్పుడే ఈ భారీ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు