Operation Valentine: వరుణ్ తేజ్ కి మరో గండం… ఈ వార్ ఎలా వర్కౌట్ అవుతుంది?

టాలీవుడ్ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”. ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. అయితే వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రీటింగ్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి ఒక గండం పొంచి ఉంది. మరి ఈ వార్ ఎలా వర్కౌట్ అవుతుంది? వరుణ్ ఆ గంధాన్ని ఎలా గట్టెక్కుతాడు?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వార్ మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానసి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయబోతోంది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఫస్ట్ స్ట్రైక్ అంటూ రిలీజ్ అయిన “ఆపరేషన్ వాలెంటైన్” టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఎయిర్ ఫోర్స్, వైమానిక దాడులు ప్రధాన కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దేశభక్తి, ప్రేమ పంటి అంశాలను కలగలిపి కమర్షియల్ వార్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇక టీజర్ లో వరుణ్ తేజ్ చెప్పిన “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా” అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా సెట్ అవ్వడంతో ఎయిర్ స్ట్రైక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ ఈ సినిమాలో కెప్టెన్ రుద్రగా కనిపించబోతుండగా, యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి నేపథ్యంలోనే మరో భారీ చిత్రం “ఫైటర్”. ఈ మూవీనే ఇప్పుడు వరుణ్ కొత్త సినిమాకు గండంగా మారబోతోంది.

- Advertisement -

పఠాన్ ఫ్రేమ్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన “ఫైటర్” మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనే కథానాయకగా నటిస్తోంది. “ఫైటర్”, “ఆపరేషన్ వాలెంటైన్” రెండు సినిమాలు కూడా వైమానిక దళ యుద్ధంతో కూడిన ప్రధాన అంశం నేపథ్యంలోనే తెరకెక్కుతున్నాయి. నిజానికి వరుణ్ తన సినిమాను జనవరిలో విడుదల చేసి ఉంటే ఎంతో కొంత ప్లస్ అయ్యేది. దేశభక్తి ఉన్న సినిమా కాబట్టి జనవరి 26న విడుదల చేస్తే టైం కలిసి వచ్చేది.

కానీ ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావలసి ఉండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి కి వాయిదా పడింది. ఇక ఈ గ్యాప్ లో జనవరి 25న రిలీజ్ అవుతున్న “ఫైటర్” ముందుగా వచ్చేస్తాడు. హృతిక్ కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో “ఫైటర్” ఎఫెక్ట్ “ఆపరేషన్ వాలంటైన్”పై ఎంతో కొంత పడుతుంది. అప్పటికే దాదాపుగా అదే కథాంశంతో వస్తున్న “ఫైటర్” మూవీని చూడడంతో “ఆపరేషన్ వాలెంటైన్” సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస ప్లాపుల కారణంగా కెరీర్లో గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. వరుణ్ కు ఇప్పుడు “ఆపరేషన్ వాలెంటైన్” హిట్ కావడం అత్యంత కీలకం. మరి ఈ వార్ ను వరుణ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి..

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు