Varun Tej : పెళ్లి అయిన తరువాత భార్యకు దూరంగా మెగా ప్రిన్స్… కారణం ఏంటంటే?

Varun Tej : వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళయిన తరువాత మొట్ట మొదటిసారి భార్యకు దూరంగా వెళ్లబోతున్నాడు అంటూ ప్రచారం జరగుతోంది. మరి వరుణ్ ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

రెండు సినిమాలకు వరుణ్ గ్రీన్ సిగ్నల్

రిజల్ట్ ఎలా ఉన్నా స్క్రిప్ట్ విషయంలో వరుణ్ తేజ్ ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాడు. కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళకుండా ఇలాంటి ప్రయోగాత్మక సినిమాల ద్వారానే మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. అందులో భాగంగానే ‘ఘని’, ‘గాంధీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి వరుస పరాజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ ‘మట్కా’ అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తున్నాడు. 70వ దశకం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే వరుణ్ తన భార్యకు దూరంగా వెళ్లబోతున్నాడు అనే ప్రచారం ఊపందుకుంది.

వాళ్ళ కోసమే భార్యకు దూరం ?

వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం మొత్తం మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మట్కా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ కాకుండా వరుణ్ ఖాతాలో ఉన్న రెండు కొత్త సినిమాలలో మొదటిది మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై దీనిని నిర్మించనుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో జరగనుందని సమాచారం. అందుకోసం ఈ మెగా హీరో కొరియా వెళ్లనున్నాడు. సెప్టెంబరు చివరి వారంలో ఈ మూవీ షెడ్యూల్‌ను ప్రారంభించి, ఒకే షెడ్యూల్‌లో ఎక్కువ భాగం చిత్రీకరణను ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు.

- Advertisement -

Tollywood's Newest Couple Varun Tej & Lavanya Tripathi's Engagement Date,  Venue, & Guest List Out! Details In! - Filmibeat

ఆయన అంగీకరించిన మరో చిత్రం విక్రమ్ సిరికొండ దర్శకత్వంలోని ఓ ప్రేమకథ. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రోబోతో హీరో ప్రేమలో పడే స్టోరీతో ఈ మూవీ రూపొందుతోంది అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ యూఎస్ఏలో మొదలవుతుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ చిత్రం కొరియా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఇది ప్రారంభమవుతుంది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ కోసమే వరుణ్ తన భార్యను వదిలి కొన్నాళ్ళు విదేశాల్లో ఉండబోతున్నారు అని అంటున్నారు.

వరుణ్ మూవీ ఆ హిందీ మూవీకి కాపీనా ?

వరుణ్ తేజ్, విక్రమ్ సిరికొండ కాంబోలో వస్తున్న మూవీ ఓ హిందీ మూవీకి కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ మూవీ ప్లాట్ ఇదేనంటూ రూమర్లు నడుస్తుండగా, ఇది అచ్చం ‘తేరీ బాటన్ మే ఐసే ఉల్జా జియా’ అనే రీసెంట్ హిందీ బ్లాక్ బస్టర్ మూవీకి కాపీలా ఉందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కూడా హీరో ఓ రోబోపై మనసు పారేసుకుంటాడు. అమ్మాయి అని తెలియక ఆమెను పెళ్లి చేసుకునేదాక వెళతాడు. ఇప్పుడు తేజ్ మూవీ కూడా అల్మోస్ట్ ఇదే పాయింట్ తో రూపొందుతోందని అంటున్నారు. కాగా 2025లో వరుణ్ తేజ్ మూడు సినిమాలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు