Matka : వరుణ్ తేజ్ సినిమాకు కష్టాలు.. షూటింగ్ క్యాన్సిల్?

Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) ప్రస్తుతం కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గద్దల కొండ గణేష్ తర్వాత మంచి హిట్ అయితే తన ఖాతాలో పడలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమాల ఇంపాక్ట్ వరుణ్ తేజ్ మార్కెట్ పైన పడిందని చెప్పొచ్చు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మట్కా ( Matka )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మట్కా గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా సినిమాకు కరుణ కుమార్ ( Karuna Kumar ) దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. హీరో మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో వరుణ్ తేజ్ ఉన్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ మూడు భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడంట. యంగ్ లుక్ తో పాటు మిడిల్ ఏజ్ గ్యాంగ్ స్టార్, ఒక మాఫియా డాన్ గా అతని క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ ఉంటుందని మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ను చూస్తే తెలుస్తుంది.

Varun Tej's Matka movie been cancelled? The news is going viral on social media
Varun Tej’s Matka movie been cancelled? The news is going viral on social media

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు డబ్బులేవట. సినిమా కష్టాల్లో ఉందని హిందీ వాళ్ళు సగం డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో షూటింగ్ పూర్తి చేశారు ఇకపోతే ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ కోసం వేట మొదలైంది రెండు షెడ్యూల్ అయిపోయాయి మూడో షెడ్యూల్ కి డబ్బులు అవసరం. ఈ సినిమా పూర్తి అవ్వడం కష్టంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వినిపించడంతో సినిమా క్యాన్సిల్ అంటూ వార్తలు ఊపందుకున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే టీమ్ నుంచి అధికారక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..

- Advertisement -

ఇకపోతే వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో 1958 నుంచి 1985 మధ్యలో జరిగే కథగా ఈ సినిమా కథాంశం ఉంటుందంట. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన కీలక షెడ్యూల్స్ ని హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో పూర్తి చేశారు. ఇప్పుడు మూవీ కొత్త షెడ్యూల్ కాకినాడ పోర్ట్ లో మొదలైందంట. పోర్ట్ తో పాటు కాకినాడ సిటీ బ్యాక్ డ్రాప్ లో కీలక యాక్షన్ ఘట్టాలని కరుణ కుమార్ చిత్రీకరించబోతున్నారంట.. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు