Varun Tej Lavanya: వేణు స్వామి ప్రిడిక్షన్ – మెగా కుటుంబంలో గొడవలు… త్వరలోనే విడాకులు?

ఈ ఏడాది జూన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం చేసుకొని చాలామందికి షాక్ ఇచ్చారు. ఎందుకంటే వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయం బయటపడలేదు. దీంతో ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇది జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత నవంబర్ 1న వీరిద్దరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇలా ఇటలీలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట అనంతరం హైదరాబాద్, డెహ్రాడూన్ లో రిసెప్షన్ వేడుకలను నిర్వహించుకున్నారు.

వీరి అభిమానులు సోషల్ మీడియాలో మీరు కలకాలం కలిసి ఉండాలని, పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తుంటే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మాత్రం వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశాలు ఏమాత్రం లేవని చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ ఎలక్షన్స్ విషయంలో తలదూర్చిన వేణు స్వామి.. కెసిఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారని బలంగా వాదించి బొక్క బోర్లా పడ్డారు. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే జ్యోతిష్యం చెప్పడం మానేస్తానని మాట ఇచ్చి అబాసుపాలయ్యారు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ – లావణ్య జాతకాలు కలవలేదని, వీరి జాతకాలలో దోషాలు ఉన్నాయని అన్నారు. వీరిద్దరి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారని.. నాకు తెలిసి వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. అంతేకాదు వీరిద్దరి కుటుంబాలలో ఓ ప్రముఖమైన స్త్రీ వల్లే వీరిద్దరూ విడిపోతారని చెప్పారు. అయితే వేణుస్వామి చెప్పిన ఆ స్త్రీ వరుణ్ తేజ్ అమ్మగారు అవుతారా..? లేక భర్తతో ఇప్పటికే విడాకులు తీసుకున్న నిహారిక వల్లే ఈ దంపతుల మధ్య గొడవలు వస్తాయా.? అన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు