Vijay Deverakonda : కొత్త దారులు వెతుకుతూ..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్న హీరో ఎవరంటే.. టక్కున విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే.. భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ అత్యంత దారుణమైన డిజాస్టార్ ను మూటగట్టుకుంది. మినిమం 200 కోట్ల కలెక్షన్లు వస్తాయని అనుకున్న రౌడీ హీరో, ఇప్పుడు లైగర్ పేరును పిలవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాలేడు. అందులో భాగంగా పూరితో వచ్చే మరో సినిమా జన గణ మన ను వదులకున్నాడు. దీని తర్వాత తన క్రేజ్ ను కాపాడుకోవడానికి ఫీల్ గుడ్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు కాబోలు.

అందుకే మాస్ డైరెక్టర్లకు దూరంగా ఉంటూ శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి, పరుశురామ్ వంటి సాప్ట్ దర్శకులతో స్టోరీలను వింటున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణతో చేస్తున్న ఖుషి సినిమా స్టార్ట్ అయింది. అది కూడా సమంత అనారోగ్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. దీంతో మరోసారి రౌడీ హీరో ఖాళీగా ఉన్నాడు. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి, పరుశురామ్ వంటి డైరెక్టర్ లతో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అది ఏం జరిగిందో తెలియదు కానీ, విజయ్ తర్వాత సినిమా గురించి ప్రస్తుతం మరో డైరెక్టర్ పేరు చర్చకు వస్తోంది.

అతనెవరంటే.. శేఖర్ కమ్ముల. ఈయన ఆనంద్, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించాడు. ఇలాంటి సాఫ్ట్ దర్శకుడు అయితే తనకు మరోసారి గీతా గోవిందం లాంటి ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ సినిమాను ఇస్తాడని విజయ్ నమ్ముతున్నట్టు తెలుస్తుంది. అందుకే వీరి మధ్య కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు టాక్. ఈ వార్త ఒక వేళ నిజమే అయితే విజయ్ దేవరకొండకు శేఖర్ కమ్ముల నుంచి హిట్ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ ఇది వరకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన విజయ్ దేవరకొండ, ఇప్పుడు అదే దర్శకుడితో హీరోగా చేయబోతున్నాడని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు