Vijay Devarakonda : కల్కిలో గెస్ట్ రోల్ కోసం రౌడీ హీరో ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేశాడో తెలుసా?

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా కల్కి 2898 ఏడీ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రతో సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఈ రోల్ ను పోషించడానికి దేవరకొండ ఎంత పారితోషికం తీసుకున్నాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

విజయ్ దేవరకొండ పారితోషికం

టాలీవుడ్ లో ఉన్న యంగ్ స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇప్పటి తరానికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకంగా ఒక స్టేటస్ ను, స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. స్పెషల్ యాటిట్యూడ్ తో ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేసి మొదటి హిట్ కొట్టాడు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు విజయ్ దేవరకొండ కెరీర్‌ని మలుపు తిప్పాయి. ఆ తర్వాత విజయ్ వెనుదిరిగి చూడలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో తాజాగా ఈ హీరో ప్రత్యేక పాత్రలో కనిపించాడు.

న్యూస్18 కన్నడ

- Advertisement -

కల్కి 2898 AD జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 298.5 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి పలువురు తారలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణంతో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, ఎస్ఎస్ రాజమౌళి, ఫరియా అబ్దుల్లా కూడా అతిధి పాత్రల్లో కన్పించి సర్ప్రైజ్ చేశారు. ఈ అతిధి పాత్రలు అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠను సృష్టించాయి. ప్రస్తుతం భారతదేశంలో మోస్ట్ ట్రెండింగ్ నటులలో ఒకరైన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపిస్తాడు. అయితే ఈ సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన అసలు తన పాత్ర కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట.

కల్కి సెకండ్ పార్ట్ లో కూడా అర్జునుడిగానే..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమాలోని చాలా మంది అతిథి పాత్రలు పోషించిన నటులు తమ పాత్రలకు ఎటువంటి రెమ్యూనరేషన్ లేకుండా పని చేశారు. అందులో విజయ్ ఒకరు. కల్కి సినిమాకు ఆయన అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కల్కిలో విజయ్ పాత్ర చిన్నదే. కానీ కల్కి 2898 AD పార్ట్ 2 లో విజయ్ దేవరకొండ పాత్ర చాలా పెద్దదిగా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో విజయ్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

కాగా ప్రభాస్ కల్కి మొత్తం బడ్జెట్‌లో 25% అంటే 150 కోట్లు పారితోషికంగా రాబట్టాడు. అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన దీపికా పదుకొణె ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో తన పాత్ర కోసం 20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. లెజెండరీ అమితాబ్ బచ్చన్ కూడా తన పాత్ర కోసం 20 కోట్లు వసూలు చేశాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు