Vijay Devarakonda: రౌడీ హీరో పేరు మార్చుకోబోతున్నాడా? ఇన్ని ఫ్లాఫ్స్ కు అదొక్కటే కారణమా?

Vijay Devarakonda :  రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఆయన ఎందుకు పేరు మార్చుకోబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవరకొండకి హిట్టు కరువు

అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ భారీ ఎత్తున పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు రౌడీ హీరోకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలింగ్ పెరిగేలా చేశాయి. కానీ ఆ తర్వాత ఆయన నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అయితే ఫ్యాన్ బేస్ తగ్గడం లేదు. కానీ సినిమాల విషయంలో మాత్రం నిరాశ ఎదురవుతోంది. అలాగే మరోవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ డేటింగ్ గురించిన పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. నిజానికి వీరిద్దరి రొమాన్స్ గురించి వార్తలు బయటకు రావడం మొదలైన తర్వాతే విజయ్ దేవరకొండ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు.

జ్యోతిష్యం ప్రకారం పేరు మార్పు

నిజం చెప్పాలంటే గీతగోవిందం సినిమా కమర్షియల్ గాను, క్రిటిక్స్ పరంగానూ పాజిటివ్ గా ఉండడం కాకుండా విజయ్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత టాక్సీవాలా ఓ మోస్తరు సినిమా అనిపించుకోగా లైగర్ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాఫ్ గా నిలిచింది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి దానర్థం ఏంటో తెలియకుండా చేసింది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ పై దారుణంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తన మాస్ ఇమేజ్ ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక హిట్ పడాల్సిందే.

- Advertisement -

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఎదుగుదల జీర్ణించుకోలేకపోతున్నారా ?? అందుకే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా ?? | Why negative comments spreading over on vijay devarakondas ...

మరోవైపు విజయ్ సినిమాలు వరుసగా తగ్గుముఖం పట్టడంతో ఆయన తల్లి కుటుంబ జ్యోతిష్యుడికి విజయ్ దేవరకొండ జాతకాన్ని చూపించారని, జాతకాన్ని బట్టి పేరు మార్చుకుంటే బాగుంటుందని వారు సూచించారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ది దేవరకొండపై కాంట్రవర్సీ

గతంలోనూ విజయ్ దేవరకొండ పేరుపై పెద్ద ఎత్తున కాంట్రవర్సీ నడిచింది. విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని చేర్చుకోవడం పై హాట్ యాంకర్ అనసూయ కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది. అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం ఎప్పుడూ ఉండేదే. ఈ నేపథ్యంలోనే మరోసారి విజయ్ దేవరకొండ పేరు మార్చుకుంటున్నాడనే వార్త సంచలనంగా మారింది.

అయితే ఆయన పేరు మార్చుకోవడానికి కారణం సినిమాలు ప్లాప్ అవ్వడమే రీజన్ అయితే, పేరు మార్చుకుంటే హిట్ కొడతాడా అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ స్టోరీ సెలక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సరైన కథలని ఎంచుకుంటే సరిపోతుంది గాని దానికి పేరు మార్చుకోవడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి కదా. అలా పేరు మార్చుకోవడం ఎంతోమంది తారలకు కూడా కలిసి వచ్చింది. మరి విజయ్ దేవరకొండ కూడా అదే బాట పడతారా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు