Vijay Devarakonda: విజయ్ దేవరకొండ డ్రీం నెరవేరినట్టేనా.? 9 కోట్లకు దూరం అంటూ ట్రోలింగ్

Vijay Devarakonda : ఇటీవల కాలంలో వరుస హిట్స్ అందుకుంటున్న విజయ్ దేవరకొండ కల్కి మూవీతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇందులో అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆయనకే మరోసారి గుర్తు చేస్తున్నారు.

9 కోట్ల దూరంలోనే..

కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మాత్రమే కాకుండా ఏ ఫిలిం ఇండస్ట్రీలో నైనా కూడా ఒక సక్సెస్ ఫుల్ హీరోగా నిలబడటం అనేది అంత సాధారణమైన పని కాదు. ఎన్నో కష్టాలు పడితే గాని హీరో స్థాయికి రాలేము. కొందరు హీరో స్థాయికి వచ్చినా కూడా దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేరు. ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత వెనక్కి తిరుగుతారు. అతి కొద్ది మంది మాత్రమే ఇక్కడ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలబడతారు.

ఇక విజయ్ పాన్ ఇండియా హీరోగా పరిచయమైన సినిమా లైగర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఈ సినిమాని నేను 200 కోట్లు కలెక్షన్స్ తో వసూలు చేస్తానని ఒక ఇంటర్వ్యూలో అన్నాడు విజయ్ దేవరకొండ. దానిని పట్టుకొని చాలామంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు అదే స్టేట్మెంట్ ను మరోసారి గుర్తు చేస్తున్నారు. కల్కి సినిమాలో అర్జునుడు పాత్రలో కనిపించాడు విజయ్ దేవరకొండ. అయితే కల్కి సినిమాకి మొదటి రోజు 190 కోట్లు వచ్చాయి. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది విజయ్ దేవరకొండ డ్రీమ్ ఫుల్ ఫీల్ అయిపోయినట్టే కేవలం 9 కోట్లు దూరంలో మాత్రమే ఉన్నాడు అంటూ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

- Advertisement -

Trolling Vijay Devarakonda Is Pretty Unjustified

హిట్ల కంటే ట్రోలింగే ఎక్కువ

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు వరుసగా రెండు మూడు హిట్ సినిమాలు చేసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ సినిమా వచ్చినా కూడా మినిమం టిక్కెట్లు తెగవు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం డీఫరెంట్ ముందుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిపోయి మంచి పేరును సాధించుకున్నాడు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. విజయ్ కాకుండా ఈ పాత్రలో ఎవరు ఊహించలేము అనే విధంగా నటించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు విజయ్ దేవరకొండను వెతుక్కుంటూ వచ్చాయి. విజయ్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ తరుణంలో విజయ్ క్యారెక్టర్ లో కొంత మార్పు వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తారు. మొత్తానికి ఆయన ఖాతాలో పడిన హిట్ల కంటే ట్రోల్సే ఎక్కువ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు