Vijay – Trisha : ప్రైవేట్ ఫోటోతో విష్ చేసిన త్రిష… విజయ్ కాపురంలో చిచ్చు పెడుతోందా?

Vijay – Trisha : స్టార్ హీరోయిన్ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ హిట్లు కొట్టి రోజురోజుకు మరింత డిమాండ్ పెంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ విజయ్ తో ఉన్న ప్రైవేట్ ఫోటోను షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోను చూసిన విజయ్ అభిమానులు త్రిష ఆయన కాపురంలో చిచ్చు పెడుతోంది అని మండిపడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో అంతగా ఏం స్పెషాలిటీ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ కి త్రిష స్పెషల్ విషెస్

సౌత్ క్వీన్ త్రిష సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అయితే ఆమె ఇప్పటికీ తన అందంతో అభిమానులను ఆకర్షిస్తుంది. పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఇక మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలు రాజకీయాలు అంటూ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో ది గోట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, విజయ్ అభిమానులు థియేటర్లలో చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Trisha's latest picture of Vijay goes viral | Telugu Cinema

- Advertisement -

ఇక తెరపై విజయ్, త్రిషలది హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ఈ జంట కెమిస్ట్రీకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే రీసెంట్ గా లియో సినిమాలో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష విజయ్ తో కలిసి ఉన్న మరో ప్రైవేట్ ఫోటోను షేర్ చేసి ఆ రూమర్లకు ఆజ్యం పోసింది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష తన ఇంస్టాగ్రామ్ లో ఈ మిర్రర్ సెల్ఫీని షేర్ చేస్తూ విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటోలో త్రిష విజయ్ మాత్రమే లిఫ్ట్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందులో ఇద్దరూ కలిసి స్టైలిష్ గా ఫోటో దిగారు. దీంతో ఆ ఫోటోలు చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

త్రిషపై విజయ్ భార్య ఫైర్

గతంలోనే విజయ్, త్రిష రిలేషన్షిప్ లో ఉన్నారని, త్రిషపై ఆయన భార్య సంగీత ఫైర్ అయ్యిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహగానాలన్నింటిని ఇటు విజయ్, అటు త్రిష కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష షేర్ చేసిన ఫోటోతో మళ్లీ ఈ రూమర్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. విజయ్ త్వరలోనే తన భార్యకు విడాకులు ఇస్తాడని, త్రిషతో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ తాజా వార్తలపై ఇప్పటిదాకా విజయ్, త్రిష స్పందించలేదు. కాగా తలపతి విజయ్ 50వ పుట్టినరోజున త్రిషతో పాటు రష్మిక మందన్న, కీర్తి సురేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు