Vishwak Sen : నెక్స్ట్ 5ఏళ్ళు కాల్చిపడేస్తా – విశ్వక్.. కాల్చుకోకుండా ఉంటే చాలంటున్న నెటిజన్లు

Vishwak Sen : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి” కూడా ఒకటి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా జరిగిన ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్, బాలకృష్ణ తో పాటు హైపర్ ఆది స్పీచ్ కూడా హైలెట్ అయింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించిన విషయం తెలిసిందే. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి ప్రత్యేక పాత్రలో నటించింది. ఇక ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ (Vishwak Sen) స్పీచ్ ఆసక్తికరంగా మారింది. తన ఎనర్జిటిక్ స్పీచ్ తో సినిమాకి హై ఇస్తూనే తనని తాను మళ్ళీ పెంచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే బాగా లేపుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముందు బాలయ్య దగ్గరి నుండి మొదలు పెట్టి, సినిమా గురించి చెప్తూ తనదాకా వచ్చాడు.

Vishwak Sen's interesting comments at the Gangs of Godavari pre-release event

నెక్స్ట్ ఐదేళ్లు కాల్చి పడేస్తా..

ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాకి ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బాలయ్య దగ్గరి నుండి మొదలు పెట్టి ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ స్టార్ట్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ లో ఓ సారి గాయపడ్డానని, వెంటనే బాలయ్య హాస్పిటల్ లో ఉండగా, బాలయ్య ఫోన్ చేసి అడిగేసరికి చాలా ఏడ్చేశానన్నాడు. ఇక తన సినిమా జర్నీ గురించి ప్రస్తావిస్తూ.. ఐదేళ్ల క్రితం మార్చి 31న ఫలక్ నుమా దాస్ రిలీజ్ అయింది. దాని వల్లే ఈ రోజు ఇక్కడ ఉన్నా.. ఈ ఐదేళ్లలో చాలా మాటలు విన్నానని, ఈ యాటిట్యూడ్ ఉంటే పనికి రాదు.. ఏదైతే తగ్గించుకోమని అన్నారో.. అదే ఆడియెన్స్‌కి నచ్చిందని.. మనం ఎట్లున్నా.. మనతో బతకాలని ఫిక్స్ అయ్యారని.. చెప్పుకొచ్చాడు. అలాగే తనని సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్తూ.. నెక్ట్స్ ఐదేళ్లు ఫైర్.. కాల్చి పడేస్తా నన్నాడు. అయితే ఈ స్పీచ్ విన్న నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

- Advertisement -

కాల్చుకోకుండా ఉంటే చాలు – నెటిజన్లు

అయితే ఈ ఈవెంట్ లో మాట్లాడిన విశ్వక్ సేన్ (Vishwak Sen) జెన్యూన్ గానే మాట్లాడినా, కాస్త ఎక్కువ మాట్లాడాడని కొందరు విమర్శకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తనని తాను ఎంతైనా లేపుకుని మాట్లాడొచ్చు గాని, ఆటిట్యూడ్ విషయంలో మారకపోతే, హీరో గా ఉండొచ్చు గాని, స్టార్ హీరో గా మారడం కష్టమని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే టాలెంట్ ఉన్నా, క్రమశిక్షణ, వినయ విధేయతలు తక్కువైతే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం. మొన్నా మధ్య మీడియం రేంజ్ హీరో అయిన విజయ్ దేవరకొండ తన లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి ఈవెంట్ లలో మాట్లాడుతూ ఎంత లేచాడో తెలిసిందే. కొన్ని ఈవెంట్ లలో చేసిన అతికి, తన సినిమాల ఓపెనింగ్స్ పై ఎంత ప్రభావం చూపించిందో తెలిసిందే. నిజం చెప్పాలంటే తన ఓవర్ ఆటిట్యూడ్ వల్ల ఇతర స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించాడు. ఫలితంగా తన సినిమాల పరిస్థితి ఏంటో తెలిసిందే. స్టార్ హీరో రేంజ్ కి వెళ్లాల్సిన వాడు, ఇంకా మీడియం రేంజ్ హీరోగానే నిలిచాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా ఇదే ఆటిట్యూడ్ కంటిన్యూ చేస్తే.. కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినంత వరకు బాగానే ఉన్నా, ఒకరోజు సినిమాలపై ఈ ఆటిట్యూడ్ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు నెటిజన్లు. సింపుల్ గా చెప్పాలంటే ఈవెంట్ లో నెక్స్ట్ ఐదేళ్లు కాల్చి పడేస్తా అన్నాడు.. తన ఆటిట్యూడ్ తో తనని తాను కాల్చుకోకుండా ఉంటే చాలు అని అంటున్నారు కొందరు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు