Vishwambhara: విశ్వంభర సినిమాపై మెగాస్టార్ అసంతృప్తి , మార్పులు జరగాల్సిందే

Vishwambhara: 2025 సంక్రాంతికి రాబోయే మోస్ట్ క్రెజియెస్ట్ ప్రాజెక్ట్స్ లో విశ్వంభర ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం అందిస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లోరాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పైన అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా వినిపించేది. చాలా పద్ధతిగా వశిష్ఠ ప్లాన్ చేసి సినిమాను పూర్తి చేస్తున్నాడు అంటూ కథనాలు వచ్చేవి. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అవేవి నిజం కాదని చిన్నగా క్లారిటీ వస్తుంది.

విశ్వంభర సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం వినిపిస్తుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పర్ఫెక్ట్ గా జరిగిన కూడా షూటింగ్ సజావుగా సాగుతున్న కూడా ఎక్కడో ఏదో లోపం ఉంది అని చిరంజీవి ఫీలవుతున్నారట. ఇక ఎం ఎం కీరవాణి లాంటి దిగ్గజ సంగీత దర్శకులు ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. కొంతమేరకు పాటలు అన్నీ కూడా బాగున్న ఎక్కడో ఏదో చిన్న అసంతృప్తి ఉంది అని తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ఫుటేజ్ అంతటినీ కూడా మెగాస్టార్ చిరంజీవి చూశారట. మంచి కథ కానీ ఎక్కడో ఒకచోట కరెక్ట్ గా కన్వే అవ్వట్లేదు అని చెబుతూ, కొన్ని మార్పులు చేసి మళ్లీ రీ షూట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Vishwambhara

- Advertisement -

ఇక ఇదివరకే ఈ సినిమాను సంక్రాంతి కానుక అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ చాలా స్పీడ్ గా ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ తరుణంలో అనుకున్నది అనుకున్నట్లు రాకపోవడం లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. ఇకపోతే కచ్చితంగా ఈ సినిమాని అనుకునే డేట్ కి రిలీజ్ చేయడానికి సిద్ధమై ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అనేది చాలామంది దర్శకులకు ఒక కల. ఆ కల అతి తక్కువ మందికి మాత్రమే నెరవేరుతుంది ఆ లిస్టులో విశిష్ట కూడా చేరిపోయాడు.

ఇక యంగ్ డైరెక్టర్ బాబి కూడా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మెగాస్టార్ అభిమానులకు పర్ఫెక్ట్ గా తనని ఎలా చూపించాలో తెలుస్తుంది అని ఊహించి ఉండొచ్చు బహుశా అందుకే యంగ్ దర్శకులకు మంచి అవకాశాలను ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఎప్పటినుంచో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ అవి ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు వచ్చే ఆనందమే వేరు అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు