Viswam : అందరు డిజాస్టర్స్ లో ఉన్నారు , రిటర్న్స్ వస్తాయా.?

Viswam : 2001 లో రిలీజ్ అయిన తొలివలపు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాలో విలన్ రోల్ లో కనిపించాడు. జయం సినిమాతో నితిన్ హీరోగా పరిచయమయ్యాడు. జయం సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన గోపీచంద్ తనకి విలన్ గానే మంచి మంచి కెరియర్ ఉంది అనేలా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తేజ దర్శకత్వం వహించిన నిజం సినిమాలో కూడా విలన్ గా కనిపించాడు.

యజ్ఞం సినిమాతో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత చేసిన ఆంధ్రుడు సినిమా పరవాలేదు అనిపించుకుంది. అయితే కమర్షియల్ గా తనకంటూ ఒక హిట్ వచ్చిన చిత్రం మాత్రం రణం అని చెప్పొచ్చు. ఆ తర్వాత చేసిన రారాజు సినిమా పరవాలేదు అనిపించింది. అయితే 2007లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ఒక్కడున్నాడు సినిమా కమర్షియల్ గా హిట్ అవడంతో పాటు మంచి ప్రశంసలను కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత లక్ష్యం, ఒంటరి, శౌర్యం, శంఖం, గోలీమార్ వంటి సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే 2014లో వచ్చిన లౌక్యం సినిమా తర్వాత ఇప్పటివరకు గోపీచంద్ కెరియర్ లో సరైన హిట్ సినిమా అంటూ లేకుండా పోయింది.

Gopichand

- Advertisement -

ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే సినిమాను చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా మీద దాదాపు 70 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మొదట గోపీచంద్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. గోపీచంద్ తో పాటు ఇంకో ప్రొడ్యూసర్ కూడా ఉండేవారు. వాళ్లు మధ్యలో తప్పుకోవటం వలన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంట్రీ ఇచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రామబాణం అనే సినిమాను కూడా చేశాడు గోపీచంద్. విశ్వం సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం శ్రీనువైట్ల కూడా హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయింది.ఈ సినిమా టీజర్ కూడా అంతంత మాత్రమే ఉంది.

ఒకవైపు లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్ కి సరైన హిట్ సినిమా లేకపోవడం. అలానే శ్రీను వైట్ల కూడా హిట్ సినిమా పడకపోవడం. ఎన్నో సినిమాలను నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి. ఇక చూసుకుంటే ఈ ప్రాజెక్టుకు పని చేస్తున్న వాళ్లందరికీ కూడా డిజాస్టర్లు ఉన్నాయి. దీనిని బట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రాఫిట్స్ వస్తాయా లేదా అనేది చాలామంది సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు