Mega Star : వివి వినాయక్ ను దూరం పెడుతున్న చిరంజీవి- కారణం అదేనా ?

మెగా స్టార్ చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి అభిమానిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన వినాయక్ అంటే చిరంజీవికి కూడా అమితమైన ప్రేమ అందుకే తన కెరీర్ లోనే అత్యంత కీలకమైన తన కంబ్యాక్ సినిమాను డైరెక్ట్ చేసేందుకు వినాయక్ కు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు . ఇక వినాయక్ కూడా చిరంజీవి పొలిటికల్ కెరీర్ కు అత్యంత కీలకమైన ఠాగూర్ సినిమా అలాగే ఖైదీ నంబర్ 150లాంటి సూపర్ హిట్స్ సినిమాలను మెగా స్టార్ కు అందించాడు. అయితే మరి అలాంటి హిట్ ట్రాక్ వినాయక్ ను చిరంజీవి గత కొద్దీ కాలంగా దూరం పెడుతున్నాడని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే చిరంజీవి తనకెంతో ఇష్టమైన వినాయక్ ను దూరం పెట్టడమేంటని అందరు ఆశ్చర్య పోతున్న వాస్తవానికి అదే నిజం అని తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి చిరంజీవి వినాయక్ ను దూరం పెడుతుండటానికి కారణం లేకపోలేదు. ఇటీవలనే వివి వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ ను బాలీవుడ్ లో హీరోగా పరిచయం చేస్తూ ఛత్రపతి సినిమా తీసాడు. భారీ బడ్జెట్ తో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఛత్రపతి సినిమాకు ముందు నుంచే వినాయక్ ఫీవర్ టాలీవుడ్ లో భారీగా పడిపోయిందని చెప్పాలి. గతకొన్నేళ్లుగా వినాయక్ తీసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. ఒకటి మించి మరొకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో వినాయక్ సినిమాలకు కాలం చెల్లిందని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సరిగ్గా అటువంటి సమయంలోనే మెగా స్టార్ చిరంజీవి వినాయక్ ను పిలిచి మరి ఖైదీ నంబర్ 150 సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా రీమేక్ సినిమా అవడం మూలాన వినాయక్ కు పెద్దగా క్రెడిట్ రాలేదు.అయితే ఎలాగోలాగ హిట్ ట్రాక్ లో అయితే ఉన్నడులే అని అనుకునే లోపు వివి వినాయక్ ఆ సక్సెస్ ను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా చూస్తే వినాయక్ మళ్ళీ చిరంజీవితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ ఇప్పటివరకు వినాయక్ చెప్పిన కథలేవి చిరు కు నచ్చడం లేదట. ఈ మధ్య కాలంలో చిరంజీవి చేసిన రీమేక్ సినిమాల వల్ల ఆయనపై తీవ్రంగా నెగిటివిటి వచ్చింది. ఇప్పుడు ఆ నెగిటివిటీ పోవాలంటే చిరంజీవి కొన్నాళ్లపాటు రొటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండటం తప్పసరి. అయితే వినాయక్ చెప్పిన కథలన్ని కమర్షియల్ సినిమా కథలే అవుతుండటంతో చిరు, వినాయక్ ను దూరం పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు