Tollywood: వెంకీ మామ కి ఏమైంది..? – కాన్ఫిడెన్స్ కోల్పోయాడా..? 

తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, కామెడీ అనగానే గుర్తొచ్చే హీరో విక్టరీ వెంకటేష్. అంతే కాకుండా అడపాదడపా యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడనటంలో ఎలాంటి సందేహం లేదు. మారుతున్న ప్రేక్షకుల టేస్ట్, మార్కెట్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకొని మల్టీ స్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొదటి స్టార్ హీరో కూడా వెంకీ మామ అనే చెప్పచ్చు. ఆ మధ్య వచ్చిన ఎఫ్2 సినిమా తర్వాత వెంకటేష్ థియేటర్ లో అలరించి హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఎఫ్3 సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
కరోనా ప్యాండమిక్ సమయంలో నారప్ప ద్వారా ఓటీటీలో హిట్ అందుకున్న వెంకటేష్, ఇటీవల రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. ఆ వెబ్ సిరీస్ మొత్తం బూతులతో నిండి ఉండటం సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేక పోయాడు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ నోటి నుండి బూతు డైలాగులు వినలేకపోయిన ప్రేక్షకులు రానా నాయుడు వెబ్ సిరీస్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో సైతం నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్నాడు వెంకటేష్. ఇక తాజాగా సల్మాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్.
టాలీవుడ్ పరిధి పాన్ ఇండియా స్థాయికి విస్తరించిన తరుణంలో వెంకీ మామ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే, రంజాన్ సందర్బంగా 21న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. ఇందులో వెంకేటేష్ క్యారెక్టర్ కి  కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేదని అంటున్నారు. వెంకటేష్ కనిపించిన సీన్లన్నీ డల్ గా ఉన్నాయని, ఒక్క సీన్ కూడా హై ఇవ్వలేదని అంటున్నారు.
ఇలాంటి క్యారెక్టర్ ని వెంకీ మామ ఎలా ఒప్పుకున్నాడని అంటున్నారు ఫ్యాన్స్. అప్పట్లో తన కామెడీ టైమింగ్ ప్లస్ ఎమోషనల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తెప్పించిన తమ హీరో ఇప్పుడు ఇలా ప్రాధాన్యత లేని క్యారెక్టర్లు చేయటం, మల్టీ స్టారర్స్ కి మాత్రమే పరిమితం అవ్వటం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సింగిల్ హీరోగా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయటానికి వెంకటేష్ భయపడుతున్నారా, అప్పటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు  లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా వెంకటేష్ తనకున్న ఫ్యాన్ బేస్ ని గుర్తించి మునపటిలా సినిమాలు చేసి అలరించాలని ఆశిద్దాం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు