SPY: హిట్టయినా, ప్లాపైనా ఈ ఫేక్ కలెక్షన్ పోస్టర్ల స్ట్రాటజీ ఏంటో?

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా రోజులుగా సరైన సినిమాలు రావట్లేదన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి వరుస విజయాలు అందుకున్న సినిమాలు మళ్ళీ రాలేదు. ఒక హిట్టు సినిమా వస్తే ఆ వెనకాలే నాలుగైదు ప్లాప్ అవుతున్నాయి. ఏప్రిల్ లో వచ్చిన విరూపాక్ష తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ రావడానికి రెండు నెలలు పట్టింది. తాజాగా సామజవరగమన సినిమాతో టాలీవుడ్ కి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిందని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా కొన్ని సినిమాల విషయంలో సినిమా కలెక్షన్ల లెక్కలు మాత్రం ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.

ఒక సినిమా హిట్ అయినా సరే, ప్లాప్ అయినా సరే వచ్చిన కలెక్షన్ల కన్నా ఎక్కువ చూపిస్తూ ఫేక్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆది పురుష్ లాంటి పెద్ద సినిమాలు కూడా ఈ స్ట్రాటజీ ని ఫాలో అయ్యాయి. ఆదిపురుష్ కి వచ్చిందానికంటే 50 కోట్లు ఎక్కువగానే చూపించారు మేకర్స్. ఇక విరూపాక్ష 100 కోట్ల మార్క్ ని దాటకున్నా, దాటేసింది చెప్తున్నారు. రీసెంట్ గా “స్పై” సినిమాకి కూడా ఇలాగే చేసారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ఇప్పటికే 25 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది మేకర్స్ పోస్టర్లు రిలీజ్ చేసారు. నిజానికి స్పై కి ఇప్పటివరకు వచ్చింది 16కోట్లే.

ఇక తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సామజవరగమన సినిమాకి కుడా భారీ కలెక్షన్లు వచ్చాయని పోస్టర్స్ రిలీజ్ చేసారు ఆ చిత్ర యూనిట్. మొదటి వారం ఆ సినిమాకి 15 కోట్ల కి కలెక్షన్లు వస్తే మేకర్స్ ఏకంగా 30కోట్లు వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఒక ప్లాప్ సినిమాకి అలా ప్రమోట్ చేసారంటే మార్కెటింగ్ కోసమో, లేక ఇన్ కమ్ టాక్స్ నుండి తప్పించుకోవడం కోసమేమో అనొచ్చు. కానీ బ్లాక్ బస్టర్ సినిమాలకి కూడా ఇలా చూపిస్తున్నారంటే అసలు వాళ్ళ లెక్కేంటో ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. మరి దీనికి కారణమేంటో నిర్మాతలే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు