Kalki 2898 AD : పార్ట్2లో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే… సీక్వెల్‌లో జరగబోయేది ఇదే

Kalki 2898 AD : కల్కి సినిమా వచ్చింది. అనుకన్నదాని కంటే భారీ హిట్ దిశగా వెళ్తుంది. కలెక్షన్లల్లో కూడా జోష్ కనిపిస్తుంది. నాలుగు రోజుల్లోనే 555 కోట్లు అందుకున్న ఈ మూవీకి 1000 కోట్ల మార్క్ అందుకోవడానికి ఎంతో టైం లేదు. ఇక సినిమా చూసిన తర్వాత క్రెడిట్ మొత్తం డైరెక్టర్ నాగ్ అశ్విన్ కే ఇస్తున్నారు ఆడియన్స్. ముందుగా అందరూ కల్కి సినిమాను ప్రభాస్ సినిమాగా అనుకున్నారు. కానీ, థియేటర్‌కి వెళ్లి చూసిన తర్వాత ఓ ప్రత్యేక ప్రపంచాన్ని క్రియేట్ చేసిన నాగికి సెల్యూట్ చేయకుండా ఉండటం లేదు అనేది నిజం.

అయితే, ప్రభాస్‌ని కూడా ఈ సినిమాలో తక్కువ అంచనా వేయలేం. సందర్భానికి అనుకూలంగా డార్లింగ్ నుంచి వచ్చిన ఫర్ఫామెన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ప్రభాస్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ రావు అని కొంత మంది ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్లందరికీ ఈ సినిమా ఓ సమాధానం అని చెబుతున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు బాగానే ఉంది. మరి.. రెండో పార్ట్ లో ఎలా ఉండబోతుంది.? ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ – అమితాబ్ బచ్చన్ మధ్య ఎక్కువ ఫైట్ నడిచింది. దీనిలో చాలా వరకు ప్రభాస్ ఓడిపోవడం మనం చూశాం. ఇది నిజానికి డార్లింగ్ అభిమానులకు పెద్దగా నచ్చలేదు. అయితే ఇప్పుడు సీక్వెల్‌లో ప్రభాస్ తలపడేది ఒక్కరితో కాదు. ఇద్దరితో.. అది కూడా మరణం అనేది లేని వారితో. అశ్వత్థామకు మరణం లేదు. కల్కి పుట్టింతే వరకు ఉంటాడు. అలాగే, యాస్కిన్.. 200 ఏళ్ల నుంచి ఎన్ని సార్లు విష ప్రయోగం జరిగినా… ఎంత మంది చంపాలని ట్రై చేసినా అన్నింటిని జయిస్తూ… పుట్టబోయే కల్కిని చంపడమే లక్ష్యంగా బతుకుతాడు. ఇప్పుడు ఈ ఇద్దరితో ప్రభాస్ తలపడాల్సి ఉంటుంది.

- Advertisement -
Prabhas Look in Kalki 2898 AD
Prabhas Look in Kalki 2898 AD

అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది… ప్రభాస్ భైరవగా ఉన్న టైంలో బలహీనుడిగా ఉండే ఛాన్స్ ఉంది. అశ్వత్థామను గానీ, యాస్కిన్‌ను గానీ, గెలిచేంత సత్తా భైరవకు ఉండదు. కానీ, కొన్ని సార్లు భైరవ… కర్ణలా మారిపోతాడు. అప్పుడు వచ్చే ఫైట్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా రాబోయే పార్ట్ 2లో మాత్రం ప్రభాస్ కు ఉండే ప్రాధాన్యత చాలా తక్కువ గా ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 1 లో క్రెడిట్ సగానికి పైగా నాగి కి వెళ్లిపోగా.. పార్ట్ 2 లో నాగితో పాటు ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ ఇంకా గెస్ట్ లుగా వచ్చే పాత్రలకు కూడా క్రెడిట్ వెళ్లే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు