Anushka: ఆ హీరోతో అనుష్క – హిట్ కాంబో రిపీట్ అవుతుందా..?

అనుష్క శెట్టి, సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం అందుకొని టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది అనుష్క. ఇక బాహుబలి సినిమా తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క లేడి ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో నటించిన అనుష్క, ప్రభాస్ కి మంచి జోడీగా గుర్తింపు పొందింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వచ్చాయి.

పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్ ని పలు సందర్భాల్లో ఇద్దరూ ఖండించినా కూడా ఇప్పటికీ ఇద్దరూ సింగిల్ గానే ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఇదిలా ఉండగా, ఈ క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతోంది అంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో  హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న క్రిష్ ప్రభాస్ కి ఓ కథ వినిపించారని, ఆ కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. నిర్మాతలు శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాకి హీరోయిన్ గా అనుష్క పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు.

అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ప్రభాస్, అనుష్కల క్రేజీ పెయిర్ రొమాన్స్ వెండితెర మీద ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఏ జానర్లో ఉంటుంది వంటి అంశాలలో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ‘ఆదిపురుష్’, ‘సాలార్’ ,’ప్రాజెక్ట్ కే’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా, అనుష్క కొంత గ్యాప్ తర్వాత  ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటిస్తోంది. దీంతో ఈ క్రేజీ పెయిర్ రొమాన్స్ చూడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు