Darshan Case : దర్శన్‌కు సపొర్ట్‌గా డిప్యూటీ సీఎం… త్వరలోనే ఈ మర్డరర్‌కి బెయిల్?

Darshan Case : అభిమానిని చిత్రవధ చేసి హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. చాలా సందర్భాల్లో స్వయంగా దర్శనే ఈ హత్య తానే చేసినట్టు పోలీసులు ముందే ఒప్పుకున్నాడు. అలాగే బయట కూడా దర్శన్ కు అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి. అయినా, దర్శన్ అభిమానులు ఆయన మంచి వాడు అంటూ చెబుతున్నారు. దర్శన్ కు బెయిల్ రావాలని పూజాలు చేస్తున్నారు. వీరీతో పాటు దర్శన్ భార్య విజయ లక్ష్మీ కూడా బెయిల్ కోసం అన్ని దారుల్లో ట్రై చేస్తుంది. తాజాగా ఈమె రాజకీయనాయకుల సపొర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే దర్శన్ కు త్వరలోనే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇటీవల దర్శన్‌కు జ్యూడిషియల్ రిమాండ్‌ను ఆగస్ట్ 1 వరకు పొడగించింది. దీంతో దర్శన్ పరప్పరం అగ్రహారం జైలులోనే ఉంటున్నాడు. దీని తర్వాత దర్శన్ భార్య కూడా బెయిల్ కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా రీసెంట్‌గా కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకూమార్ ను కలిసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం డీకే చెప్పారు.

ఓ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తన దగ్గరికి దర్శన్ భార్య విజయలక్ష్మీ వచ్చిందని అన్నారు. దర్శన్ కేసు గురించి మాట్లాడుతుందని అనుకున్నానని, కానీ, ఆమె తన కొడుకు స్కూల్ అడ్మిషన్ గురించి మాట్లాడిందని చెప్పుకొచ్చారు. అయితే, డిప్యూటీ సీఎం డీకేని కలవడానికి దర్శన్ భార్య విజయలక్ష్మీతో పాటు దర్శన్ సోదరుడు దినకర్ తో పాటు డైరెక్టర్ ప్రేమ్ కూడా ఉన్నారట. దీంతో డిప్యూటీ సీఎం డీకే – విజయలక్ష్మీ మధ్య కేవలం స్కూల్ అడ్మిషన్ గురించే కాకుండా, దర్శన్ టాపిక్ కూడా రావొచ్చు అని అంటున్నారు.

- Advertisement -

అలాగే ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం డీకే… ఓ సందర్భంలో దర్శన్ తప్పుచేయకపోతే, అతనికి నిజంగానే అన్యాయం జరిగితే, తప్పకుండా సాయం చేస్తానని అనౌన్స్ చేశాడు. దీంతో దర్శన్ కేసుపై రాజకీయ మలుపు తిరగబోతుందని, త్వరలోనే ఆయనకు బెయిల్ రాబోతుందని, బయటికి వచ్చే ఛాన్స్ ఉందని కన్నడలో అప్పుడే టాక్ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు