Anjali : అంజలి అలాంటి పాత్రలు చెయ్యడానికి కారణం అతనేనా?.. ఆ మోసం మర్చిపోలేకే…

Anjali : తెలుగు అందం అంజలి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.. జర్నీ సినిమా ఒక్కటే మంచి ఫేమ్ ను అందించింది.. ఆ తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా సరైన హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. ప్రస్తుతం బోల్డ్ పాత్రల్లో కనిపిస్తుంది.. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో అంజలి వేశ్య పాత్రలో కనిపిస్తుంది.. ఆ సినిమాలు హిట్ అవ్వడంతో ఆమెకు అలాంటి పాత్రలే వస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. అంజలి అలాంటి పాత్రలు చెయ్యడానికి కారణం ఇదే అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

అంజలి తెలుగు అమ్మాయి.. అయితే తమిళ్ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి.. అందులో హిట్ కన్నా ప్లాప్ సినిమాలో ఈమె ఖాతాలో ఉన్నాయి.. అయితే రీసెంట్ గా గీతాంజలి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.. మొదటి పార్ట్ సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. ఆ తర్వాత విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది.. ఆ తర్వాత నిన్న వచ్చిన బాహిష్కరణ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ను పలకరించింది.. ఆ వెబ్ సిరీస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..

Will hero Jai act in prostitute roles just by saying breakup?
Will hero Jai act in prostitute roles just by saying breakup?

ఇదిలా ఉండగా.. అంజలి ఈ మధ్య వేశ్య పాత్రలో నటించడానికి కారణం ఇదే అనే వార్త నిన్నటి నుంచి బాగా ట్రెండ్ అవుతుంది.. బహిష్కరణలో అంజలి పెర్ఫార్మన్స్ ఓ రేంజులో ఉంది.. దాంతో జనాలు అందుకే ఆ కసితోనే చేస్తుందని అంటున్నారు.. ఏంటంటే.. జర్నీ సినిమాలో తనతో పాటు నటించిన జై తో అంజలి రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.. గతంలో చాలా సార్లు వీరిద్దరి పై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపించాయి.. అయితే పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట సడెన్ గా బ్రేకప్ చెప్పేశారు.. అతను అంజలిని వదిలెయ్యడంతోనే కోపంతో తనలోని మరో కోణాన్ని చూపిస్తూ వేశ్య పాత్రలనే ఎంపిక చేస్తుందని ఇండస్ట్రీలో టాక్.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే అంజలి రెస్పాండ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు