Shraddha Das : ఈ సినిమాతో శ్రద్ధా కి సెకండ్ ఇన్నింగ్స్ లో కలిసొస్తుందా?

Shraddha Das : టాలీవుడ్ లో చాలా ఏళ్ళ కింద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇంకా నిలదొక్కుకోలేకపోతున్న హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ముంబై లో ఓ బెంగాలీ ఫ్యామిలీలో కి చెందిన ఈ అందాల తార తెలుగు ఇండస్ట్రీ లో దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే హీరోయిన్ గా మాత్రం ఇప్పటివరకు బ్రేక్ రాలేదు. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా, మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్నా, అవకాశాలు అంతగా రాలేదు. మెయిన్ లీడ్ గా చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయితే మధ్యలో సెకండ్ లీడ్ చేసినవి ఓ మోస్తరుగా ఆడాయి. అలా ఆర్య 2, గుంటూరు టాకీస్, నాగవల్లి, డిక్టేటర్ , డార్లింగ్ వంటి చిత్రాలలో శ్రద్ధా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటిన ఈమె, ఢీ 15 డాన్స్ షో తో బుల్లితెరపై జడ్జిగా అలరించింది.

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అవకాశాలు నో?

అయితే శ్రద్ధా దాస్ (Shraddha Das) గుంటూరు టాకీస్ సినిమాతో సెకండ్ లీడ్ గా ప్రత్యేక పాత్రల్లో నటించడానికి డిసైడ్ కాగా, ఆ చిత్రంలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయగా, ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చినా అవకాశాలు అంతగా రాలేదు. హిప్పీ, ఏ మినీ కథ వంటి సినిమాలలో చిన్న చిన్న రోల్స్ లో నటించిన మళ్ళీ తెలుగు సినిమాల్లో అంతగా కనిపించలేదు. అలా అని వేరే భాషలో బిజీ అయిందా అంటే అది కూడా కాదు. ఆ మధ్య కన్నడ లో కోటిగుబ్బ 3 లో కీలకపాత్రలో నటించింది. ఇక తెలుగులో మూడేళ్ళ తర్వాత లాస్ట్ ఇయర్ నిరీక్షణ అనే చిన్న సినిమాలో నటించింది. ఇక చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక కామెడీ డ్రామాలో కీలక పాత్రలో నటిస్తుంది శ్రద్ధా దాస్. ఈ సినిమాతో ఈమె సెకండ్ ఇన్నింగ్ లో సక్సెస్ కొడదామని గట్టిగా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాతోనైనా గాడిలో పడుతుందా?

అయితే శ్రద్ధా దాస్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సరైన సినిమా పడడం లేదు. ఇక చాలా రోజుల తర్వాత శ్రద్ధా దాస్ పారిజాత పర్వం అనే సినిమాలో కీలకపాత్రలో నటించింది. తాజాగా ఆ సినిమా ట్రైలర్ చూడగా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఒక కిడ్నాప్ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ కాగా, ఈ సినిమాలో శ్రద్దా దాస్ మెయిన్ లీడ్ కావచ్చు అని ట్రైలర్ చుస్తే అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ కూడా లేదు కాబట్టి ఫిమేల్ లీడ్ శ్రద్ధా అనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే నైనా శ్రద్ధా కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి. ఇక చైతన్య రావు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా ఒక సినిమా ఆర్టిస్ట్ గా కనిపిస్తుంది. సునీల్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి వాళ్ళు కీలకపాత్రల్లో నటించారు. ఇక ఏప్రిల్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా శ్రద్ధా కెరీర్ గాడిలో పడుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమా కాకుండా శ్రద్దా అర్ధం అనే మరో సినిమాలో కూడా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు