Premalu : కార్తికేయ కి ఇక లాభాల పంటే..! ఇక పై పూర్తి స్థాయిలో?

టాలీవుడ్ లో ఎస్.ఎస్. రాజమౌళి కొడుకు కార్తికేయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి సినిమాలకు ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూ సినిమాల విజయంలో కీలకంగా మారుతున్నారు. రెండేళ్ల కింద వచ్చిన RRR సినిమా గ్లోబల్ స్థాయిలో రీచ్ రావడానికి మార్కెటింగ్ పరంగా కార్తికేయ కృషి ఎంతో ఉంది. రాజమౌళి దత్తత పుత్రుడైన ఎస్.ఎస్.కార్తికేయ కి రాజమౌళి ప్రొడక్షన్లో ఇప్పటికే మంచి అనుభవం ఉంది. అయితే రాజమౌళి సినిమాలు కాకుండా కార్తికేయ ఇప్పటివరకూ బయటి సినెమాలకు పని చేసింది లేదు. అతను తండ్రి తీసే సినిమాల ప్రొడక్షన్లో కీలకంగా వ్యవహరించినా అది ఇంటివరకే అన్నట్టు ఉంటుంది. అయితే బయట నిరూపించుకోవాలని కార్తికేయ ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నాడు.

ప్రేమలు సక్సెస్ తో కార్తికేయ భారీ లాభాలు..

అయితే కార్తికేయ నిర్మాత గా కూడా సినిమాలు చేయాలనీ భావిస్తున్నాడు. అది కాకుండా పూర్తి స్థాయిలో సొంతంగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్న ఆసక్తి ఉంది.కానీ.. అది ఇంకా ఒక కొలిక్కా రాలేదు. గతంలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ‘ఆకాశవాణి’ అనే సినిమాలో నిర్మాణ భాగస్వామి అయి అప్పుడే మళ్లీ తప్పుకున్నాడు. నిర్మాతగా మారడం కన్నా ముందు డిస్ట్రిబ్యూటర్ గా తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్మాతగా చిన్న చిన్న అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే కార్తికేయ రీసెంట్ మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ను తెలుగు హక్కులు దక్కించుకుని మార్చి 8న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఎక్కడా మలయాళ నేటివిటీ లేకుండా తెలుగు సినిమా అనిపించేలా కథ, నేపథ్యం ఉండేటట్లు సినిమాని ఎడిట్ చేసారు మేకర్స్. ఆ విషయంలో సినిమాకి చాలా ప్లస్ అయింది. ఒరిజినల్లో కూడా ఈ కథ హైదరాబాద్ నేపథ్యంలోనే నడుస్తుంది. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ ఫేమ్ ఆదిత్య హాసన్‌తో ట్రెండీ డైలాగులు రాయించడం.. మీమ్స్‌ను ఫుల్లుగా వాడేసుకోవడంతో ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తో కలిసి ఫస్ట్ డే తెలుగు వెర్షన్ రెండు కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో పోటీగా ఇతర సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈ రేంజ్ వసూళ్ళంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాకి ముందు వారంలో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవడం వల్ల ‘ప్రేమలు’కు మంచి సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గామి, భీమా సినిమాల కంటే కూడా ఈ సినిమాకే ఇంపార్టెన్స్ పెరిగింది. ఇక రెండో రోజు ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. తక్కువ మొత్తానికి రైట్స్ తీసుకుని మంచి క్వాలిటీతో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయడంతో కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలే తీసుకువస్తుంది.

భారీ లాభాలతో ఇక పూర్తిస్థాయి సినిమా?

ప్రేమలు తెలుగు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఈ సినిమాకి 10 కోట్ల వరకు తెలుగు లో కలెక్షన్లు రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే కార్తికేయ కి కనీసం అన్ని ఖర్చులూ పోయి మూడు నాలుగు కోట్ల ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో ఒక మంచి చిన్న సినిమా తీసే అవకాశం ఉంది. ఇక ప్రేమలు సక్సెస్ తో కార్తికేయ పూర్తి స్థాయి నిర్మాతగా సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రేమలు లాగే ఏదయినా చిన్న లవ్ స్టోరీ గాని కామెడీ డ్రామా గాని తీసి ఆ తర్వాత పెద్ద సినిమాలు తీయాలని చూస్తున్నట్టు టాక్. ఏది ఏమైనా ప్రేమలు మూవీతో కార్తికేయ భారీ లాభాలు అందుకోవడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు